- బెదిరింపులతో స్వేచ్ఛాయుత ఎన్నికలకు భంగం ఎన్నికల ప్రచారంలో సిటింగ్ ఎమ్మెల్యే అశోక్
యానాం, మహి న్యూస్, ఏప్రిల్ 6 :
యానాంలోనే జీవనం సాగిస్తూ సొంత ఇల్లులేని పేద మధ్యతరగతి ప్రజల సొంతింటి కల సాకారమయ్యేలా తాను గెలిచినవెంటనే ఇళ్లపట్టాల పంపిణీ చేపడతానని ఆవిధంగా ఇప్పటికే 10 ఎకరాల స్థలాన్ని గుర్తించినట్లు ఆవిధంగా తన సొంతఖర్చులతో ఇళ్లపట్టాల పంపిణీ చేస్తానని సిటింగ్ ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్అశోక్ పేర్కొన్నారు. సోమవారం అంబేడ్కర్నగర్, గణపతినగర్ తదితర ప్రాంతాల్లో ఆయన బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అర్ధాని దినేష్ తో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వందలాది కుటుంబాలు జీవనోపాధి కోసం యానాంలో స్థిరనివాసం ఏర్పాటుచేసుకుని ఉంటున్నారని అయితే గత కొన్నేళ్లుగా ప్రభుత్వం ఇళ్లపట్టాలు ఇవ్వకపోవడంతో పలు కుటుంబాలు ఇరుకుగదుల్లోను, అద్దె ఇండ్లలోను జీవిస్తున్నా రన్నారు. ఈ సమస్యను పరిష్కరించడానికి తాను ఇప్పటికే పలువురినుంచి ఇండ్ల పట్టాల పంపిణీకి విజ్ఞాపన పత్రాలను తీసుకున్నానన్నారు. వాటిని స్క్రూటినీ చేసి తన సొంత బర్చులతో భూమిని కొనుగోలుచేసి ఇళ్లపట్టాలుగా ఇస్తానని ఎవరి రికమండేషన్ ఆక్కర్లేదని తానే స్వయంగా ఆర్హులైనవారికందరికి అందజేస్తానన్నారు. ఇండ్ల స్థలం ఇవ్వడంతో పాటు గృహనిర్మాణాలకు ఋణాలు మంజూరు చేసేలా కృషి చేస్తానన్నారు.

గ్రామాల్లో ప్రజలను బెదిరిస్తున్న మల్లాడి కార్యకర్తలు… ఎన్ఆర్కాంగ్రెస్ అభ్యర్థి మల్లాడి కృష్ణారావు అలాగే ఆయా గ్రామాల్లో ఆయన అనుచరులు, కార్యకర్తలు తమపార్టీకి, ఇతర పార్టీలకు మద్దతుగా ఉన్నవారిపై బెదిరింపులకు పాల్పడుతున్నారని పలు రకాలుగా భయపెడుతున్నారని సిటింగ్ ఎమ్మెల్యేగొల్లపల్లి శ్రీనివాస్అశోక్ ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో నచ్చిన పార్టీకి మద్దతునివ్వడానికి, నచ్చిన వ్యక్తికి ఓటువేసే హక్కు, స్వేచ్ఛ ప్రజలకు ఉందని బెదిరింపులకు పాల్పడేవారిపై ఎన్నికల అధికారికి పిర్యాదు. చేయాలని ప్రజలను కోరారు.

