- ఇంజనీరింగ్ అధికారుల సమీక్షలో జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి
- సెంట్రలైజ్డ్ స్మార్ట్ కిచెన్ షెడ్ కొత్త డిజైన్ పై.. సూచనలు
కడప, మహి న్యూస్ ఫిబ్రవరి 7 : జిల్లాలో పెండింగ్ లోవున్న అన్ని రకాల ఎన్ఆర్ఈజీఎస్ పనులను.. ఈ ఆర్థిక సవత్సరంలోగా పూర్తి చేయాలని.. జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి సంబంధిత శాఖల ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు.
శనివారం జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో.. ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా జిల్లాలో జరుగుతున్న వివిధ రకాల అభివృద్ధి పనుల పురోగతిపై.. ఎన్ఆర్ఈజీఎస్, పంచాయతీ రాజ్ శాఖ ఇంజినీరింగ్ అధికారులతో జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… జిల్లా అభివృద్ధిలో భాగంగా.. ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా జిల్లాలో జరుగుతున్న వివిధ రకాల అభివృద్ధి పనులను ఈ ఆర్థిక సంవత్సరంలోగా ప్రత్యేకించి మార్చి 15 లోగా పూర్తి చేయాలన్నారు. 100% పూర్తి చేయగల పనులను గుర్తించి వారం రోజుల్లోగా ప్రారంభించేలా చర్యలు చేపట్టాలన్నారు.
ఈ ఆర్థిక సంవత్సరానికి జిల్లాలో ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా 2059 పనులు మంజూరయ్యాయని..
ఇప్పటికే చాలా పనులు చేయడం జరిగిందన్నారు. ఇప్పటికే పనులు మొదలు పెట్టి పురోగతిలో ఉన్న వాటిని మార్చి 15 లోపు పూర్తి చేయాలన్నారు. కంకా మొదలు పెట్టాల్సిన పనులను కూడా.. నిర్దేశించిన సమయంలోగా పూర్తి చేయగలిగితేనే మొదలు పెట్టాలన్నారు. త్వరితగతిన చేయగలిగిన గోకులం షెడ్స్, సిసి రోడ్లు, బిటి రోడ్లు, డబ్ల్యూ ఎం రోడ్లు, కాంపౌండ్ వాల్ మొదలైన పనులను ఎంపిక చేసుకుని 100% పూర్తి చేసేలా మొదలు పెట్టాలన్నారు. ఈ విషయంలో లక్ష్యం మేరకు పనుల పూర్తితో పాటు నాణ్యతతో ఎలాంటి రాజీ లేకుండా చూడాలన్నారు.
ఆకాంక్ష జిల్లాల అభివృద్ధిలో భాగంగా.. జిల్లాలో ఎంపికైన మండలాల్లో అన్ని రకాల మౌలిక సదుపాయాలను కల్పించాలన్నారు. అంతేకాకుండా ఆయా మండలాల్లోని అన్ని గ్రామాలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలన్నారు. అలాగే.. ఆయా గ్రామాల్లో వ్యవసాయ అనునుబంధ రంగాల్లో చేపట్టాల్సిన అభివృద్ధిపై దృష్టి సారించాలన్నారు.
ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీల సమన్వయ సహకారంతో.. ఆయా నియోజకవర్గాల్లో నిర్వహిస్తున్న అన్ని రకాల పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించి పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.
- సెంట్రలైజ్డ్ స్మార్ట్ కిచెన్ షెడ్ కొత్త డిజైన్ పై.. సూచనలు
జిల్లాలో చేపడుతున్న సెంట్రలైజ్డ్ స్మార్ట్ కిచెన్ షెడ్ల నూతన నమూనాలను పవర్ పాయింట్ ద్వారా ఇంజినీరింగ్ అధికారులకు చూపించిన జిల్లా కలెక్టర్.. కిచెన్ షెడ్ ఔట్ లుక్ డిజైన్ ప్రత్యేకతలను వివరించి అదేలాగున పనులను చేపట్టాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో.. డ్వామా పీడి అదిశేషారెడ్డి, , పంచాయతీరాజ్ ఎస్ఈ మద్దయ్య, ఆయా శాఖల డివిజనల్ స్థాయి ఇంజినీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.


