వై.ఎస్.ఆర్. కడప, మహి న్యూస్ ఫిబ్రవరి 07:
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ఆధ్వర్యంలో ఈ నెల 09 నుండి 11 తేదీల వరకు నిర్వహించనున్న ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ మరియు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్–III పోస్టుల నియామక పరీక్షలను పటిష్టంగా, పారదర్శకంగా నిర్వహించాలని ఇంచార్జి జిల్లా రెవిన్యూ అధికారి వెంకటపతి ఆదేశించారు.
శనివారం కలెక్టరేట్‌లోని జిల్లా రెవిన్యూ అధికారి ఛాంబర్‌లో పరీక్షల నిర్వహణపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా రెవిన్యూ అధికారి మాట్లాడుతూ, జిల్లాలోని మూడు పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా సజావుగా నిర్వహించాలన్నారు. అభ్యర్థులను ఉదయం 08.00 నుండి 08.45 గంటల వరకు, మధ్యాహ్నం 01.00 నుండి 01.45 గంటల వరకు మాత్రమే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించాలని సూచించారు.

పరీక్షా కేంద్రాల్లో మాల్‌ప్రాక్టీస్‌కు అవకాశం లేకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని, లైజన్ ఆఫీసర్లు, చీఫ్ సూపరింటెండెంట్లు, పోలీసు శాఖ సమన్వయంతో పనిచేసి పరీక్షలు సాఫీగా జరిగేలా చూడాలని తెలిపారు. ప్రతి పరీక్షా కేంద్రంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయబడిందన్నారు.
అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆయా పరీక్షా కేంద్రాల యాజమాన్యాలు అవసరమైన అన్ని వసతులు కల్పించాలని సూచించారు.
జిల్లాలో కడప నగర పరిధిలో రెండు, చింతకొమ్మదిన్నె మండల పరిధిలో ఒక పరీక్షా కేంద్రాన్ని ఎంపిక చేసినట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాల వివరాలు అనెక్సర్ –I లో పొందుపరచినట్లు పేర్కొన్నారు.

అదేవిధంగా, కలెక్టర్ కార్యాలయంలో APPSC పరీక్షలకు సంబంధించి 09.02.2026 నుండి 11.02.2026 వరకు కార్యాలయ సమయాల్లో అభ్యర్థుల సహాయార్థం హెల్ప్‌డెస్క్ (ఫోన్ నెం: 08562-246344) ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ఈ సమావేశంలో పరిపాలన అధికారి కె. విజయ కుమార్, ఏపీపీఎస్సీ జిల్లా ప్రత్యేక అధికారులు జి. అశోక్ (అసిస్టెంట్ సెక్రటరీ), పి. రమేష్ (అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్), లైజన్ ఆఫీసర్లు మరియు చీఫ్ సూపరింటెండెంట్లు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో ఏపీపిఎస్ ఈ సిబ్బంది,లైజన్ ఆఫీసర్లు, చీఫ్ సూపరింటెండెంట్లు మరియు లేబర్,పోలీస్, మెడికల్,ఏపీఎస్పీడీసీఎల్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.


