పి గన్నవరం, మహి న్యూస్,ఫిబ్రవరి08:
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, పి. గన్నవరం మండలం, జి. పెదపూడి గ్రామంలో డొక్కా సీతమ్మ ఫెడ్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అగ్రికల్చర్ డ్రోన్‌ను పి. గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు గిడ్డి సత్యనారాయణ ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రైతుల మేలు లక్ష్యంగా అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని తెలిపారు. వ్యవసాయానికి అవసరమైన యంత్ర పరికరాలు, అగ్రికల్చర్ రోడ్లు, పవర్ టిల్లర్లు తదితరాలను సబ్సిడీ కింద రైతులకు అందిస్తున్నామని అన్నారు.ఈ అగ్రికల్చర్ డ్రోన్ మొత్తం విలువ రూ.9 లక్షల 84 వేలు కాగా, ఇందులో రూ.7 లక్షల 84 వేలు ప్రభుత్వ సబ్సిడీగా లభిస్తుందని, రైతులు కేవలం రూ.2 లక్షలు మాత్రమే వెచ్చించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. రైతును రాజుగా భావించే కూటమి ప్రభుత్వం 80 శాతం సబ్సిడీతో డ్రోన్లను అందిస్తున్నదని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.



