డోన్ మహి న్యూస్ ఫిబ్రవరి 15
ప్రముఖ శాస్త్రవేత్త శ్రీ గెలీలియో గారి జయంతి సందర్బంగా
డోన్ పట్టణం లో సామాజిక కార్యకర్త డోన్ పి. మహమ్మద్ రఫి ఆధ్వర్యంలో ప్రముఖ శాస్ర్తవేత్త శ్రీ గెలీలియో గారి జయంతి సందర్బంగా వారి చిత్ర పటానికి పూలమాల వేసి ఘణంగా నివాళి అర్పించారు వారిని స్మరించుకున్నారు.ఈ సందర్బంగా సామాజిక కార్యకర్త డోన్ పి. మహమ్మద్ రఫి మాట్లాడుతూ
మన దేశ స్వాతంత్య్ర సమరయోధులను, శాస్త్రవేత్తలను ,మహనీయులను, సమాజానికి సేవలు అందించిన ప్రతి ఒక్కరిని స్మరించుకుంటూ వారి అడుగుజాడల్లో నడవాలని సామాజిక కార్యకర్త డోన్ పి.మహమ్మద్ రఫి కోరారు
శ్రీ గెలీలియో గారు ఫిబ్రవరి 15 – 1565 ఇటలీ లోని పిసా నగరం లో జన్మించారు. ఈయన ఇటలీకు చెందిన భౌతిక శాస్త్రవేత్త,గణితజ్ఞుడు, భౌగోళిక శాస్త్రజ్ఞుడు మరియు తత్వవేత్త.టెలీస్కోపు(దూరదర్శిని) ను వాడుకలోకి తెచ్చాడు.చిన్న వయసులో తండ్రి వద్దనే విద్యాభ్యాసం చేశాడు. తరువాత పీసా విశ్వవిద్యాలయంలో వైద్య విద్యార్థిగా చేరాడు. అయితే అక్కడి గణితశాస్త్ర ఉపన్యాసాలకు ప్రభావితుడై వైద్యవిద్యను విడిచి, గణిత శాస్త్రాన్ని అధ్యయనం చేశాడు. ఆ తరువాత అక్కడే గణితశాస్త్రంలో ఉపన్యాసకులుగా చేరాడు.గెలీలియో మొట్టమొదటి నాణ్యత గల టెలిస్కోప్ నిర్మాత. ఈయన టెలిస్కోప్ గురించి విని సింగ్ ఆరోరియా మహారాజు వెనిస్ కు రమ్మని కబురంపాడు కూడా! ఆయన టెలిస్కోప్ చూసి ఎంతోమంది ఆశ్చర్య పడ్డారు. వెనిస్ చర్చి పైభాగానికి వెళ్ళీ ఎంతో దూరంలో ఉన్న నౌకలను పది రెట్లు దగ్గరగా ఎంతో మంది గెలీలియో టెలిస్కోప్ ద్వారాచూడగలిగారు. ఆయనను ప్రశంసించారు. ఈ టెలిస్కోప్ గెలీలియో పరిశోధనలో ముఖ్యమైనది.ఎన్నో విశ్వ రహస్యాలను గెలీలియో ఛేదించగలిగాడు.బృహస్పతి గ్రహానికి ఉన్న ఉపగ్రహాలను గెలీలియో చూడగలిగాడు.గెలీలియో అప్పుడే కనుగొన్న టెలిస్కోపుద్వారా శుక్రగ్రహ ఉపగ్రహాలను ప్రజలకు చూపించి నికోలస్ కోపర్నికస్ సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని ధృవీకరించారు. మన పాలపుంతలో కోట్లాది నక్షత్రాలు ఉన్నాయని ఊహించి చెప్పగలిగాడు.ఈ టెలిస్కోప్ ను ఉపయోగించి సేకరించిన సమాచారాన్ని బట్టి కోపర్నికస్ యొక్క సూర్య కేంద్రక సిద్ధాంతంను బలపరిచాడు. క్రీ.శ 1616 లో గెలీలియో విశ్వానికి సూర్యుడే కేంద్రమని సూర్యుని చుట్టే భూమి తిరుగుతుందని తెలియజేశారు.1642, జనవరి 8 తేదీన తన 78వ ఏట అనారోగ్యం తో మరణించారు. శాస్త్రీయ వాస్తవాలను ప్రపంచానికి తెలియజేసిన ఇలాంటి మహానుభావుల ఆశయాలకు అనుగుణంగా విద్యార్థులు అనేక పరిశోధనలు చేసి దేశానికి సేవ చెయ్యాలని సామాజిక కార్యకర్త డోన్ పి. మహమ్మద్ రఫి కోరారు.
మీ
పి. మహమ్మద్ రఫి సామాజిక కార్యకర్త డోన్ .

