అనంతపురం ,మహి న్యూస్ ఫిబ్రవరి 15 :
అనంతపురంలో జన్మించిన బంజారా జాతి ముద్దుబిడ్డ, గొప్ప హేతువాది సంత్ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతోత్సవం ముంబై లంబాడిలు ఘనంగా జర్పారు. ఆదివారం కంజూర్ మార్గ్- బాండుప్ బంజారా సేవా సంఘం, గోర్ సేన శిక్ వాడి, 11తండేవాసిలు గత 7ఏళ్ల నుంచి అనవహితీగా వేడుకలు నిర్వహిస్తున్నారు. వీరు రంగారెడ్డి, వికారాబాద్, ఉమ్మడి మెహబూబ్ నగర్ జిల్లాలకు చెందినవారు ఇక్కడ నివాసమై ఉన్నారు. మొదట్లో అంబేడ్కర్ చౌక్ నుంచి గుడి మండపం వరకు తమదైన లంబాడి అంగరంగ వేశాధారణలలో భారీ ర్యాలీ నిర్వహించారు. తదుపరి బహిరంగ సభ ఏర్పాటైది. అందులో స్థానిక ఎమ్మెల్యే సునీల్ బావు రాహుత్, కౌన్సిలర్స్ దీపక్ సావంత్, శ్వేతతాయి పావస్కర్, శాంతిలాల్ బోర్డే తదితర రాజకీయ నాయకులు పాల్గొని తమ జాతి ప్రజలకు అన్ని వెళ్లాలో చేదోడు వాదోడుగా ఉంటామని హామీచ్చారు. ఇటీవల ఎంబిబిఎస్ పాసైన వరుణ్ రనావత్ విద్యార్థి తోపాటు అనేక ప్రముఖులను సన్మానించారు. చిన్న పిల్లలచే సాంస్కృతిక డ్యాన్స్ లు జరిగాయి. కార్యక్రమంలో బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి నాగ్ సేన్ మాలజీ, మూలనివాసి మాలజీ, బండు రనావత్ నాయక్, రాజు, రతన్ చందర్, బతరాం నర్సింగ్, శంకర్, రాములు, గంగారాం, హరిలాల్, చింట రాజు, దేవేందర్, గోపాల్, బాబు రాం చందర్, సరిత దేవి అనుష్క, సభకు రమేష్ రాథోడ్ వ్యాఖ్యతగా వ్యవహారించారు.


