Close Menu
mahinewsindiamahinewsindia
  • Home
  • AndhraPradesh

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

ఎన్ ఆర్ పార్టీని నమ్మని యానం ఓటర్లు! .. ” యానంలో కాంగ్రెస్ ప్రభంజనం “

07/04/2026

వినూత్న రీతిలో మల్లాడికి ప్రచారం

07/04/2026

ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి

07/04/2026
Facebook X (Twitter) Instagram Threads
Facebook X (Twitter) Instagram
mahinewsindiamahinewsindia
SUBSCRIBE
  • Home
  • AndhraPradesh
mahinewsindiamahinewsindia
Home»AndhraPradesh»ఆత్మవిశ్వాసం సడలిన రోజే అపజయం మనల్ని ఆవహిస్తోంది – అడిషనల్ ఎస్పీ అడ్మిన్ వి.వి.నాయుడు.
AndhraPradesh

ఆత్మవిశ్వాసం సడలిన రోజే అపజయం మనల్ని ఆవహిస్తోంది – అడిషనల్ ఎస్పీ అడ్మిన్ వి.వి.నాయుడు.

editorBy editor04/03/2026Updated:04/03/2026No Comments2 Mins Read
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

కృష్ణాజిల్లా మహి న్యూస్ మార్చి 04

అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాలలో భాగంగా జిల్లా ఎస్పీ శ్రీ వి.విద్యాసాగర్ నాయుడు ఐపీఎస్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ప్రతి పాఠశాల విద్యాసంస్థలలో మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు కృష్ణాజిల్లా పోలీసులు. అందులో భాగంగా ఈరోజు స్థానిక మచిలీపట్నంలోని నిర్మల హైస్కూల్ నందు నిర్వహించిన సెల్ఫ్ డిఫెన్స్ శిక్షణా కార్యక్రమానికి అడిషనల్ ఎస్పీ అడ్మిన్ వి.వి. నాయుడు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మహిళా పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ రమేష్ , నిర్మల హైస్కూల్ ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

విద్యార్థులకు వారి యొక్క ఆత్మ రక్షణ, భద్రత, ప్రమాదం సంభవించే సమయంలో తమను తాము ఏ విధంగా రక్షించుకోవాలి, పట్టుదల ఏకాగ్రత తో ఎలా ముందుకు సాగాలి, వంటి అంశాలపై అవగాహన కల్పించారు. మరి ముఖ్యంగా సెల్ఫ్ డిఫెన్స్ నిపుణుల ఆధ్వర్యంలో తరగతులు నిర్వహించి చిన్నచిన్న టెక్నిక్స్ తో తమను తాము ఏ విధంగా రక్షించుకోవచ్చు తెలియజేశారు.

ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ మాట్లాడుతూ*

▪️ఆత్మరక్షణ అనేది కేవలం మన శరీరానికి సంబంధించిన అంశమే కాదని మానసికంగా మనలో దృఢత్వాన్ని పెంచడానికి ఇది ఎంతగానో సహాయపడుతుందన్నారు. విద్యార్థులు అపరిచిత వ్యక్తులతో అప్రమత్తంగా వ్యవహరించడం, అనుమానాస్పద పరిస్థితులు ఎదురైతే తక్షణమే పోలీసు, కుటుంబ సభ్యులు, బంధువుల కు సమాచారం అందించడం వంటివి చేయాలని అన్నారు.

▪️బాలికలు ఎంత దృఢంగా ఉంటే తమను తాము అంత ధైర్యంగా రక్షించుకోగలరని, ఆపద సంభవించే సమయంలో ఎవరో రక్షిస్తారని వేచి ఉండే కన్నా ముందుగానే తమను తామే రక్షించుకునే నైపుణ్యాన్ని కలిగి ఉండాలని తెలిపారు.

▪️చదువు మాత్రమే కాకుండా శారీరకృఢత్వాన్ని పెంపొందించుకొని సెల్ఫ్ డిఫెన్స్ పై పూర్తి పట్టు సాధిస్తే ఎలాంటి ప్రమాదకర పరిస్థితులు ఎదురైనా సునాయాసంగా తప్పించుకోగలరని తెలిపారు.

▪️మరి ముఖ్యంగా నేటి సమాజంలో అమ్మాయిలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో సామాజిక మాధ్యమాల ద్వారా జరిగే నేరాలే అధికం. ముఖ పరిచయం లేని వ్యక్తుల వలన ప్రమాదాలు ఏ రూపంలోనైనా రావచ్చని కనుక ప్రతి ఒక్కరూ ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకొని చెడు ఆకర్షణలకు లోనవ్వకుండా, ప్రతి ఒక్క విద్యార్థిని వారి యొక్క బలాలు, బలహీనతలు తెలుసుకొని బలహీనతలను అధిగమించి, వివిధ రంగాలలో ఉన్న అవకాశాలను తెలుసుకొని అభివృద్ధి పథంలో పయనించాలని తెలిపారు.

అంతేకాకుండా జిల్లా వ్యాప్తంగా ఎస్పీ ఆదేశాల మేరకు ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న విద్యాసంస్థలు, పాఠశాలలు, కళాశాలల్లో సెల్ఫ్ డిఫెన్స్ లలో నిష్ణాతులైన వారి ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు నిర్వహించి, ఆకస్మాత్తుగా ఎవరైనా దాడి చేసిన తమను తాము ఏ విధంగా రక్షించుకోవాలి తెలియజేశారు. ఈ ఒక్క రోజే కాకుండా నిరంతరం సెల్ఫ్ డిఫెన్స్ ను అలవాటుగా మార్చుకొని సంపూర్ణ మహిళగా మారాలని పోలీసు అధికారులు తెలిపారు.

Share. Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
editor
  • Website

Related Posts

ఎన్ ఆర్ పార్టీని నమ్మని యానం ఓటర్లు! .. ” యానంలో కాంగ్రెస్ ప్రభంజనం “

07/04/2026

వినూత్న రీతిలో మల్లాడికి ప్రచారం

07/04/2026

ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి

07/04/2026
Leave A Reply Cancel Reply

Our Picks
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo
Don't Miss
AndhraPradesh

ఎన్ ఆర్ పార్టీని నమ్మని యానం ఓటర్లు! .. ” యానంలో కాంగ్రెస్ ప్రభంజనం “

By admin07/04/20260

యానాం, మహి న్యూస్,ఏప్రిల్ 6. గతంలో 2016లో ఎన్నార్ పార్టీ అభ్యర్థిగా తిరుకోటి భైరవ స్వామి పోటీ చేసినప్పుడు, ప్రత్యర్థి…

వినూత్న రీతిలో మల్లాడికి ప్రచారం

07/04/2026

ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి

07/04/2026

అన్నివర్గాల అభివృద్ధే ధ్యేయంగా కృషి – ఎన్ఆర్కాంగ్రెస్అభ్యర్ధి మల్లాడి

07/04/2026

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us
About Us

Your source for the lifestyle news. This demo is crafted specifically to exhibit the use of the theme as a lifestyle site. Visit our main page for more demos.

We're accepting new partnerships right now.

Email Us: info@mahinewsindia.com
Contact: 90636 36329

Our Picks
New Comments
  • ప్రిన్స్ on విజయ మిల్క్ సంస్థ నుంచి రిటైర్డ్ అవుతున్నందుకు బాధగా ఉంది : డిప్యూటీ డైరెక్టర్ డిఎం వలి
Facebook X (Twitter) Instagram YouTube
  • Home
  • AndhraPradesh
Designed by Rivx Studios.

Type above and press Enter to search. Press Esc to cancel.