కర్నూలు మహి న్యూస్ మార్చి 04
ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ చట్టాన్ని పునరుద్ధరిస్తామని సంక్షేమ పథకాలు అమలు చేస్తామన్న వాగ్దానాన్ని అమలు చేయాలని సిఐటియు నాయకులు కోరారు ఓల్డ్ సిటీ భవన నిర్మాణ కార్మికులు డిమాండ్ చేశారు ఎలక్ట్రికల్ కార్పెంటర్ గౌండ పెయింటర్స్ కార్మికులతో సంతకాల సేకరణ కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి చాంద్ బాషా అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా సిఐటియు నగర అధ్యక్షులు అబ్దుల్ దేశాయ్ భవన నిర్మాణ కార్మికులు ఓల్డ్ సిటీ ప్రధాన కార్యదర్శి సయ్యద్ కాజాపాషా మాట్లాడుతూ ఎన్నికల ముందు ఒక మాట ఎన్నికల తర్వాత ఒక మాట చెప్పడం ప్రభుత్వాలకు ఎన్నికల ముందు ఒక మాట ఎన్నికల తర్వాత ఒక మాట మారిందని ఇచ్చిన మాట తప్పడం చేసిన వాగ్దానాన్ని మర్చిపోవడం ఏమిటని వారు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గత ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును నిర్వీర్యం చేయడం సంక్షేమ పథకాలను అమలు చేయకుండా నిర్లక్ష్యం చేయడం వల్ల భవన నిర్మాణ కార్మికులు తీవ్రంగా నష్టపోయి వారి కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నాయని వారు తెలిపారు భావన నిర్మాణ కార్మికులు సంక్షేమం కోసం వసూలు చేసిన ఒక శాతం పన్ను సెస్సు 3.294 సంక్షేమ వెల్ఫేర్ బోర్డు లో ఉన్నాయని రాజ్యసభ సభ్యులు కార్మిక శాఖ మంత్రి అధికారులు ప్రకటించారు సెస్సు రూపంగా వసులైన డబ్బులు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలు అమలు చేయాలి ప్రస్తుత ప్రభుత్వం అధికారం చేపట్టి రెండు సంవత్సరాలు అవుతున్న సంక్షేమ బోర్డును పునరుద్ధరించకుండా నిర్లక్ష్యం చేయాల్సిందని తెలిపారు ఇప్పటికే భవన నిర్మాణ కార్మికులకు పనులు లేక ధరలు పెరిగి ఒకపక్క చాలీచాలని కూలీలతో బ్రతకాల్చి వస్తుందని వారు తెలిపారు కార్మిక శాఖ సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి నాలుగు వాగ్దానాలు మాత్రం చేశాడని ప్రసూతి సౌకర్యం 20 వేలు దహన సంస్కారాలకు 20 వేలు వివాహానికి 40 వేలు సాధారణ మరణానికి 60 వేలు మాత్రం ప్రకటించాడని ప్రమాద బీమా 5 లక్షలు సౌకర్యం పై ఎటువంటి నిర్ణయం చేయకపోవడం ఏమిటి అని వారు ప్రశ్నించారు ఆక్సిడెంటల్ గా చనిపోతే ఐదు లక్షలు గాయపడిన వారికి రెండు లక్షలు ఇవ్వాలని స్కాలర్షిప్లు మంజూరు చేయాలని 50 సంవత్సరాలు నిండిన భవన నిర్మాణ కార్మికులకు నెలకు పదివేల పెన్షన్ ఇవ్వాలని గత ఐదు సంవత్సరాల నుండి బోర్డులో శాంక్షన్ అయి నిధులు రాక పెండింగ్ ఉన్న వాటికి నిధులు మంజూరు చేసి సంక్షేమ పథకాలు అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు కూటమి ప్రభుత్వం పునరాలోచించి భవన నిర్మాణ కార్మిక సంక్షేమ చట్టాన్ని అన్ని పథకాలు పూర్తిగా అమలు చేయాలి చేయకుంటే రాబోయే కాలంలో కార్మికులను సమీకరించి ఆందోళన చేపట్టాల్సి వస్తుందని వారు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో గౌస్ ఖలీల్ మొహమ్మద్ మూస ఖాదర్ ఫయాజ్ గోరే భాయ్ తదితరులు హాజరయ్యారు

