కర్నూలు సిటీలోని విజయపురి కాలనీలో జరుగుతున్న డ్రైనేజ్ నిర్మాణ పనుల్లో నిర్లక్ష్యం బయటపడుతోంది. కాలువ మధ్యలోనే విద్యుత్ స్తంభాన్ని వదిలి పనులు చేపట్టడం స్థానికులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
సరైన ప్రణాళిక లేకుండా నిర్మాణం చేపట్టడం వల్ల భవిష్యత్తులో నీటి ప్రవాహానికి ఆటంకం కలగడమే కాకుండా ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సంబంధిత అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని కాలనీ వాసులు కోరుతున్నారు.

