.చిత్తూరు జిల్లా/ బంగారుపాలెం మార్చ్ 9.చిత్తూరు జిల్లా, పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలం మొగిలి గ్రామంలో ఉన్న పురోహితులు పంచాంగ కర్త డాక్టర్ పాణ్యం శ్రీనివాస్ శర్మ రచించిన 2026-27 వ నూతన పరాభవ నామ సంవత్సర నూతన పంచాంగమును సోమవారం చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి, కలెక్టర్ సుమిత్ కుమార్, చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ వారి చేతుల మీదుగా పంచాంగం ఆవిష్కరణ జరిగింది. అఖిలభారత పురోహితులు సంఘ అధ్యక్షులు పాణ్యం శ్రీనివాస శర్మ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డిని జిల్లా కలెక్టర్ సమిత్ కుమార్ ను గురజాల జగన్మోహన్ ను దుస్సాలవాలతో సత్కరించిన అనంతరం ఆశీర్వచనాలు, తీర్థప్రసాదాలను అందించి ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని దీవించారు.ఈ కార్యక్రమం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరగడం సంతోషంగా ఉందని పాణ్యం శ్రీనివాస్ శర్మ తెలిపారు. కార్యక్రమంలో మొగిలి శ్రీనివాస శర్మతో పాటు పలువురు పాల్గొన్నారు

