చిన్న వయసులోనే మేడికొండ బాష కవిత్వంపై పట్టుదల ఉండడం అభినందనీయం
తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు

జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మహి న్యూస్ మేడికొండ గ్రామానికి చెందిన కవి రచయిత మేడికొండ బాష తను రచించిన సుగంధ పరిమళాలు పుస్తకాన్ని హైదరాబాద్ లోని నందినగర్ లో తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారిని మర్యాదపూర్వకంగా కలిసి సుగంధ పరిమళాలు పుస్తకాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మేడికొండ బాష ను ఆశీర్వదిస్తూ , దీవించారు. చిన్న వయసులోనే కవిత్వం పై పట్టుదల పెట్టుకోవడం అభినందనీయమని అన్నారు. భవిష్యత్తులో కవిత్వం పట్ల మేడికొండ బాష ఉన్నతమైన స్థానానికి ఎదగాలని మరోసారి ఆశీర్వదించారు._

