Saturday, 08 August 2026
News that matters, as it happens
Header-2
BREAKING

మొక్కలు నాటిన ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కడప జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు భూపేష్ సుబ్బరామిరెడ్డి

జిల్లా/జమ్మలమడుగు ఆగస్టు 07 (మహి న్యూస్ ) పర్యావరణ పరిరక్షణలో భాగంగా జమ్మలమడుగు మున్సిపాలిటీ పరిధిలోని ముద్దనూరు రోడ్డులో ఉన్న అగ్నిమాపక కేంద్రం వద్ద మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జమ్మలమడుగు శాసనసభ్యులు ఆదినారాయణ రెడ్డి, కడప జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు భూపేష్ సుబ్బరామిరెడ్డి పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా అగ్నిమాపక కేంద్రం పరిసర ప్రాంతాల్లో పలు రకాల మొక్కలను నాటారు. పర్యావరణ పరిరక్షణకు మొక్కలు ఎంతో కీలకమని, భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాల్సిన అవసరం ఉందని వారు పేర్కొన్నారు. పట్టణాలు, గ్రామాల్లో పచ్చదనం పెంపొందించేందుకు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు రావాలని సూచించారు. మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, పచ్చదనాన్ని పెంపొందించడం ద్వారా పర్యావరణ సమతుల్యతను కాపాడుకోవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అగ్నిమాపక సిబ్బంది పాల్గొన్నారు. అగ్నిమాపక కేంద్రం పరిసరాల్లో మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కార్యక్రమంలో పాల్గొన్న వారు తెలిపారు.

0 Comments

Leave a Comment

Related Stories

Home
Section
More
💬 Join Our Official WhatsApp Channel!
Get instant breaking news alerts, exclusive video updates, and top headlines delivered straight to your phone. Follow us on your favorite platforms!
💬 Follow WhatsApp Channel 📺 Subscribe YouTube 📷 Instagram 🪺 Follow X