Friday, 11 September 2026 News that matters, as it happens
Header-2
BREAKING

భూసార పరీక్ష కేంద్రం పని చేస్తోందా ?- డా. ముచ్చుకోట సురేష్ బాబు

Share this Article:
మాది రైతు ప్రభుత్వం అంటే మాదే నిజమైన రైతు ప్రభుత్వం అంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతు సంక్షేమం కోసం ఎంత ఆరాట పడుతున్నారో నిశితంగా పరిశీలిస్తే తెలుస్తుంది. కేంద్ర ప్రభుత్వం 2015 ఫిబ్రవరిలో భూసార పరీక్షా కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభించినది. మొదటి దఫా దేశంలో 12 కోట్ల రైతులకు సాయిల్ హెల్త్ కార్డ్స్ ఇచ్చినట్లు ప్రకటించారు. 2018 లో రెండో దఫా 11 కోట్ల రైతులకు సాయిల్ హెల్త్ కార్డ్స్ జారీ చేసినట్లు ప్రభుత్వ వెబ్సైటులో సమాచారం పొందుపరచారు. దేశంలో 7949 సాయిల్ టెస్టింగ్ ల్యాబ్స్ ఉన్నాయి. ఇవి ఏమాత్రం సరిపోవు. 82 గ్రామాలకు ఒక ల్యాబ్ ఉంది. కేవలం 7949 భూసార పరీక్షా కేంద్రాలు 23 కోట్ల కార్డులు ఎలా పంపిణీ చేశారో అర్థం చేసుకోవచ్చు. 98 శాతం రైతులకు వారు సాగు చేసే భూమి లోని లోపాలు గురించి తెలియదు. తెలిసినా దానికి తరుణోపాయం వ్యవసాయ అధికారులు తెలుపరు. అనంతపురం జిల్లా కేంద్రంలో ఒకటి కదిరి పెనుకొండ లో రెండు సబ్ యూనిట్లు ఉన్నవి. గత ఆరు సంవత్సరాలుగా ఇవి నిస్తేజంగా ఉన్నాయి. నెలకు కనీసం పది మట్టి నమూనాలు పరీక్షించిన సందర్భాలు లేవు. ప్రభుత్వ భూసార పరీక్షా కేంద్రాలలో మట్టి పరీక్షలు జరపడానికి కావాల్సిన పరికరాలు, బఫర్ సొల్యూషన్స్, రియజెంట్లు లేక చాలా కాలం అవుతున్నది. మట్టి సేకరించడానికి మొబైల్ టెస్టింగ్ వాహనం ప్రమాదం జరిగి ఏడు సంవత్సరాలుగా నిరుపయోగంగా ఉంది. చాలా గ్రామాలల్లో మట్టి సేకరణ జరుగలేదు కానీ సాయిల్ హెల్త్ కార్డులు జారీ చేశారు. ఉన్న పరీక్షా కేంద్రంలో సిబ్బంది చాలా తక్కువ. రైతు తీసుకెళ్లిన మట్టి నమూనాలో వీరు పరీక్ష చేసేది కేవలం ఎన్పికే మాత్రమే మైక్రో న్యూట్రీషియన్ టెస్టు, భార లోహాలు టెస్టు, సల్ఫర్, జింక్, మాంగనీస్ ఇతరత్ర పరీక్షలు నిర్వహించరు. ఆరుగురు మంది సిబ్బంది ఉమ్మడి జిల్లాలో ఉన్న రైతులందరికీ హెల్త్ కార్డులు జారీ చేసారంటే అది సాధ్యపడే విషయమేనా ? రైతులందరికీ కార్డులు ఇవ్వాలంటే 70 ల్యాబ్స్ అవసరం అవుతాయి. ఈ కార్యాలయాలు చూసిన తర్వాత ప్రతి ఒక్కరికీ వచ్చే సందేహం ఇవి నిరర్థక ఆస్తుల జాబితాలో ఉంటే ఎంత బాగుండు అనిపిస్తుంది. అందువల్ల గ్రామీణ నిరుద్యోగులకు టెస్టింగ్ ల్యాబ్‌ను ప్రారంభించాలని యోచిస్తున్న ఔత్సాహికులకు రెండు ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. షాప్‌ రెంట్‌కు తీసుకొని పని చేయడం ఒక పద్ధతి. మొబైల్ టెస్టింగ్ ల్యాబ్స్ రెండో ఆప్షన్. ఇందులో ఒక వెహికల్‌పై ల్యాబ్‌ను ఏర్పాటు చేసుకోవాలి. సాయిల్ టెస్టింగ్ కేంద్రాల సంఖ్యను బాగా పెంచాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. కానీ ఇంతవరకు అమలుకు నోచుకోలేదు. గ్రామాల్లో ఉన్న వారు ఈ స్కీమ్‌కు అర్హులు. 18 నుంచి 40 ఏళ్ల మధ్యలో వయసు ఉండాలి. రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి రెండేళ్లకు ఒకసారి మట్టి కండీషన్ ఎలా ఉందో తెలుసుకోవడానికి సాయిల్ టెస్ట్ చేస్తూ ఉంటాయి. దీని ద్వారా నేలలో ఏ ఏ పోషకాలు తక్కువగా ఉన్నాయో తెలుసుకోవచ్చు.
WhatsApp Image 2026-07-18 at 10.53.03 AM (1).jpeg
Type image caption here...


WhatsApp Image 2026-07-18 at 10.53.02 AM (1).jpeg
Type image caption here...


WhatsApp Image 2026-07-18 at 10.53.02 AM.jpeg
Type image caption here...



📰
Official Article Source Link
https://mahinewsindia.com/post/16
💬 Join Our Official WhatsApp Channel!
Get instant breaking news alerts, exclusive video updates, and top headlines delivered straight to your phone. Follow us on your favorite platforms!
💬 Follow WhatsApp Channel 📺 Subscribe YouTube 📷 Instagram 🪺 Follow X