Friday, 11 September 2026 News that matters, as it happens
Header-2
BREAKING

దాల్మియా సిమెంట్ రెండో ప్లాంట్‌తో కడప జిల్లాకు పారిశ్రామిక అభివృద్ధి కొత్త ఊపు

Share this Article:

దాల్మియా సిమెంట్ రెండో ప్లాంట్‌తో కడప జిల్లాకు పారిశ్రామిక అభివృద్ధి కొత్త ఊపు


కడప జిల్లా/జమ్మలమడుగు/మైలవరం, జూలై 15 (మహి న్యూస్): వైఎస్సార్ కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం మైలవరం మండలం చిన్నకొమెర్ల గ్రామపంచాయతీ పరిధిలో దాల్మియా సిమెంట్ రెండో ప్లాంట్ భూమిపూజ కార్యక్రమం బుధవారం ఘనంగా నిర్వహించారు.


ఈ కార్యక్రమానికి రాష్ట్ర విద్య, సమాచార సాంకేతిక శాఖల మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్, రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి టీజీ భరత్, జిల్లా ఇన్‌చార్జి మంత్రి సవితమ్మ, దాల్మియా గ్రూప్ ప్రతినిధి పునీత్ దాల్మియా, జమ్మలమడుగు శాసనసభ్యుడు చదిపిరాళ్ల ఆదినారాయణ రెడ్డి, వైఎస్సార్ కడప జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చదిపిరాళ్ల భూపేష్ సుబ్బరామిరెడ్డి, కడప శాసనసభ్యురాలు రెడ్డప్పగారి మాధవి రెడ్డి, శాసన మండలి సభ్యుడు రామగోపాల్ రెడ్డి, జిల్లా కలెక్టర్ డా. చెరుకూరి శ్రీధర్ తదితరులు హాజరయ్యారు.


అతిథులు భూమిపూజ నిర్వహించి ప్లాంట్ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. దాల్మియా సిమెంట్ రెండో ప్లాంట్ ఏర్పాటుతో జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధికి మరింత ఊతం లభించడంతో పాటు స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని పలువురు అభిప్రాయపడ్డారు.


ఈ కార్యక్రమంలో రైతులు, ప్రజాప్రతినిధులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, దాల్మియా సిమెంట్ సంస్థ అధికారులు, ఉద్యోగులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

📰
Official Article Source Link
https://mahinewsindia.com/post/7

0 Comments

Leave a Comment
💬 Join Our Official WhatsApp Channel!
Get instant breaking news alerts, exclusive video updates, and top headlines delivered straight to your phone. Follow us on your favorite platforms!
💬 Follow WhatsApp Channel 📺 Subscribe YouTube 📷 Instagram 🪺 Follow X