Friday, 11 September 2026 News that matters, as it happens
Header-2
BREAKING

జమ్మలమడుగు టీడీపీ కార్యాలయంలో భూపేష్ రెడ్డి ప్రజా దర్బార్

Share this Article:

కడప జిల్లా/జమ్మలమడుగు మహి న్యూస్ జూలై 17

జమ్మలమడుగు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జిల్లా టీడీపీ అధ్యక్షుడు భూపేష్ సుబ్బరామిరెడ్డి ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు.

మైలవరం మండలం లింగాపురం గ్రామానికి చెందిన ప్రజలు ఎం. కంబాలదిన్నె రహదారి నుంచి చంద్రాయుడు స్వామి దేవాలయం వరకు రహదారి అభివృద్ధి, అలాగే లింగాపురం సుగాలి తండాలో సిమెంట్ రోడ్ల నిర్మాణం చేపట్టాలని వినతిపత్రం అందజేశారు.

వద్దిరాల గ్రామానికి చెందిన కొర్రపాటి చిన్ని కృష్ణుడు పేరుపై ఉన్న భూమి ఆన్‌లైన్ రికార్డుల్లో పొరపాటున తులసిమ్మ పేరుకు మారిందని, దీనిపై విచారణ జరిపి న్యాయం చేయాలని మరో వినతిపత్రం సమర్పించారు.

పెద్దముడియం మండలం జి. కొత్తపల్లి గ్రామ ప్రజలు తమ గ్రామంలో ఏఎన్‌ఎం లేకపోవడం, మురుగు కాలువల సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పేర్కొంటూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు.

మైలవరం మండలం ఎ. కంబాలదిన్నె గ్రామానికి చెందిన రంగస్వామి రెడ్డి తన సర్వే నంబర్ 4-14లోని 1.08 ఎకరాల భూమికి సంబంధించిన 1-బి రికార్డు అందడం లేదని ఫిర్యాదు చేస్తూ వినతిపత్రం అందజేశారు.

ప్రజల సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని భూపేష్ రెడ్డి హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొన్నారు.

📰
Official Article Source Link
https://mahinewsindia.com/post/13

0 Comments

Leave a Comment
💬 Join Our Official WhatsApp Channel!
Get instant breaking news alerts, exclusive video updates, and top headlines delivered straight to your phone. Follow us on your favorite platforms!
💬 Follow WhatsApp Channel 📺 Subscribe YouTube 📷 Instagram 🪺 Follow X