ఐక్యరాజ్యసమితి సదస్సు కోసం న్యూయార్క్ రానున్న ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహును అరెస్ట్ చేసే అంశంపై న్యూయార్క్ నగర మేయర్ జోహ్రాన్ మామ్దానీ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. శనివారం 'ది న్యూయార్క్ టైమ్స్'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మేయర్ మాట్లాడుతూ.. నెతన్యాహును ఒక యుద్ధ నేరస్థుడిగా అభివర్ణించారు. అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు (ఐసీసీ) ఆయనపై మోపిన ఆరోపణల నేపథ్యంలో, ఆయన ది హేగ్‌లోని జైలుకు వెళ్లాల్సిన వ్యక్తి అని స్పష్టం చేశారు.
తన ఎన్నికల ప్రచారంలోనే నెతన్యాహును అరెస్ట్ చేస్తానని మామ్దానీ హామీ ఇచ్చారు. అయితే, ఒక విదేశీ దేశాధినేతను అరెస్ట్ చేసే అధికారం నగర మేయర్‌కు ఉందా లేదా అనే అంశంపై తాము ప్రస్తుతం నగర న్యాయ సలహాదారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు ఆయన వెల్లడించారు. "న్యూయార్క్ నగర చట్టాలు నాకు ఏ మేరకు అనుమతి ఇస్తే.. ఆ మేరకు చర్యలు తీసుకోవడానికి నేను వెనుకాడను" అని మామ్దానీ తేల్చి చెప్పారు. గత కొన్నేళ్లుగా నెతన్యాహు తీసుకున్న నిర్ణయాల వల్లే ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ఇదే అభిప్రాయంతో ఉన్నారని ఆయన పేర్కొన్నారు.
మేయర్ మామ్దానీ వ్యాఖ్యలపై ఇజ్రాయెల్ శ్రేణులు తీవ్రంగా స్పందించాయి. ఐరాసలో ఇజ్రాయెల్ రాయబారి డానీ డానన్ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా కౌంటర్ ఇస్తూ.. "న్యూయార్క్ నగరంలో పెరుగుతున్న యూదు వ్యతిరేకతను (యాంటీ సెమిటిజం) అరికట్టడం చేతకాని మేయర్, కేవలం హెడ్‌లైన్స్‌లో నిలవడం కోసమే ఇజ్రాయెల్‌పై దాడి చేస్తున్నారు. మీ బెదిరింపుల వల్ల ఏమీ మారదు. ప్రధాని నెతన్యాహు సగర్వంగా న్యూయార్క్ వస్తారు, ఐరాసలో ఇజ్రాయెల్ తరఫున గళం విప్పుతారు. ఈ కేసులో ఎవరినైనా అరెస్ట్ చేయాల్సి వస్తే, అది మొదట మేయర్ జోహ్రాన్ మామ్దానీనే" అని మండిపడ్డారు. కాగా, ఒక రేడియో షోలో నెతన్యాహు మాట్లాడుతూ.. మేయర్ మామ్దానీ హమాస్ ఉగ్రవాదులకు మద్దతు ఇస్తున్నారని, ఆయన మనసులో అమెరికాపై తీవ్ర ద్వేషం దాగి ఉందని ఆరోపించారు
News that matters, as it happens
Friday, 11 September 2026
mahinewsindia.com
న్యూయార్క్ లో అడుగుపెడితే నెతన్యాహు అరెస్ట్?.. మేయర్ సంచలన వ్యాఖ్యలపై ఇజ్రాయెల్ ఫైర్!
📰
Official Article Source Link
https://mahinewsindia.com/post/22