Saturday, 08 August 2026
News that matters, as it happens
Header-2
BREAKING

తాళ్లచెరువు గ్రామ ఆర్టీసీ బస్సు రూట్‌లో కీలక మార్పులు

తాళ్లచెరువు, మహి న్యూస్ ఆగస్టు 9: గ్రామ ప్రజల రవాణా సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని తాళ్లచెరువు ఎస్సీ మాదిగపల్లె మీదుగా ఆర్టీసీ బస్సు రూట్‌లో మార్పులు చేశారు. గ్రామ ప్రజల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి, బస్సు రూట్ మార్పు కోసం “మార్పు కోసం ఒక్క అడుగు” బృందం చేసిన నిరంతర కృషి ఫలితంగా ఈ మార్పు అమల్లోకి వచ్చింది. ఆగస్టు 9 నుంచి ఉదయం 9:30 గంటల ఆర్టీసీ బస్సు అచ్చంపేట హెచ్‌పీ బంక్ రోడ్డు నుంచి తాళ్లచెరువు గ్రామంలోకి ప్రవేశించి, ఎస్సీ మాదిగపల్లె మీదుగా, చెరువు సమీపంలోని మాదిపాడు–అచ్చంపేట రహదారి, గురుకుల పాఠశాల మీదుగా సత్తెనపల్లికి వెళ్లనుంది. అదేవిధంగా రాత్రి వేళ వచ్చే బస్సులు చర్చి వద్ద ఆగనున్నాయి. తెల్లవారుజామున బయలుదేరే బస్సులు కూడా చర్చి వద్ద నుంచే ప్రారంభమవుతాయి. ఉదయం 9:30 గంటల బస్సు మాత్రమే ఎస్సీ మాదిగపల్లె మీదుగా ప్రయాణించనుంది. బస్సు రూట్ మార్పుకు సహకరించిన ఆర్టీసీ అధికారులు, సంబంధిత అధికారులు మరియు ప్రతి ఒక్కరికీ “మార్పు కోసం ఒక్క అడుగు” బృందం కృతజ్ఞతలు తెలిపింది. ఈ బస్సు సౌకర్యం నిరంతరంగా కొనసాగేందుకు రహదారిపై ఎలాంటి అడ్డంకులు లేకుండా చూసుకోవడం గ్రామ ప్రజలందరి బాధ్యత అని, ఆర్టీసీ బస్సు సౌకర్యాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని బృందం సభ్యులు విజ్ఞప్తి చేశారు. తాళ్లచెరువు గ్రామ అభివృద్ధి, సమానత్వం, ప్రజా సమస్యల పరిష్కారమే తమ లక్ష్యమని, ప్రజల అవసరాలకు అనుగుణంగా భవిష్యత్తులోనూ కృషి కొనసాగిస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మేదర రాఘవ, దుగ్గి శ్రీనివాస్ దళపతి, మేదర అజయ్, చింతపల్లి అనిల్ కుమార్, రేపూడి అనిల్, చిలకా ప్రశాంత్, చింతపల్లి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

0 Comments

Leave a Comment

Related Stories

Home
Section
More
💬 Join Our Official WhatsApp Channel!
Get instant breaking news alerts, exclusive video updates, and top headlines delivered straight to your phone. Follow us on your favorite platforms!
💬 Follow WhatsApp Channel 📺 Subscribe YouTube 📷 Instagram 🪺 Follow X