42 మందికి రూ.24.54 లక్షల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ
✍️ By Admin
📅 08 Aug 2026, 05:53 PM
⏱️ 1 min read
👁️ 4 views
*కడప జిల్లా/ జమ్మలమడుగు ఆగస్టు 8 (మహి న్యూస్)* జమ్మలమడుగు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కడప జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు భూపేష్ సుబ్బరామిరెడ్డి పాల్గొని 42 మంది లబ్ధిదారులకు రూ.24,54,904 విలువైన చెక్కులను పంపిణీ చేశారు.
అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమైన భూపేష్ సుబ్బరామిరెడ్డి ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమాన్ని చేపట్టాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని, ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను ప్రతి ఇంటికి వెళ్లి తెలియజేయాలని నాయకులు, కార్యకర్తలను కోరారు.
ప్రజల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేయడంతో పాటు పార్టీ కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో విస్తృతంగా నిర్వహించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Share Preview42 మందికి రూ.24.54 లక్షల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ

https://mahinewsindia.com/post/62
📬
Subscribe to Newsletter
Get breaking news & story updates delivered to your inbox.
0 Comments