మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోండి
జిల్లా,డివిజన్,మండల కేంద్రాలలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహణ
ప్రతి సోమవారం ఉదయం 9.30 నుంచి ఉ.10 గంటల వరకు డయల్ యువర్ కలెక్టర్
ఫోన్ చేయవలసిన ల్యాండ్ లైన్ నెం.08562-244437
: జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి
: డి ఆర్ ఓ విశ్వేశ్వర నాయుడు
వై ఎస్ ఆర్ కడప,మహి న్యూస్ ఫిబ్రవరి 15 :
- *ఈ నెల 16వ తేదీన జిల్లా కలెక్టరేట్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కు ప్రజలు వినియోగించు కోవాలని డి ఆర్ ఓ విశ్వేశ్వర నాయుడు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
- *అర్జీదారులు దాఖలు చేసిన తమ అర్జీలు ఇప్పటికీ పరిష్కారం కాకపోయినా,లేదా తమ ఫిర్యాదులకు సంబంధించిన సమాచారం తెలుసుకోవడానికి 1100 నంబర్‌కు కాల్ చేయవచ్చునన్నారు. అర్జీదారులు వారి యొక్క అర్జీలు నమోదు చేసుకోవడానికి Meekosam.ap.gov.in (మీకోసం డాట్ ఏపీ డాట్ జివో వి డాట్ ఇన్) వెబ్సైట్ నందు వారి యొక్క అర్జీలు నమోదు చేసుకోవచ్చన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ సమస్యలకు పరిష్కారం పొందాలని విజ్ఞప్తి చేశారు.
- *ఈ నెల 16 వ తేదీన సోమవారం కలెక్టరేట్ లోని సభా భవన్ నందు ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రసెల్ సిస్టం, పిజిఆర్ఎస్) కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని కలెక్టరేట్ లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నిర్వహించడం జరుగుతుందని,ఈ కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లాఅధికారులు పాల్గొంటారని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో తమ వివరాలతో పాటు వారి సమస్యలకుసంబంధించి అర్జీలను అంద జేయాలన్నారు.అర్జీదారులు గతంలో ఇచ్చిన అర్జీలకు సంబంధించిన స్లిప్పును తీసుకురావాలని సూచించారు. సమస్య పరిష్కారమైనప్పుడు ఫోన్ కి మెసేజ్ వస్తుందని, అర్జీదారులు వారి ఫోన్ ను చెక్ చేసుకోవాలన్నారు. నోటీసులు,ఎండార్స్మెంట్ ను వాట్స్అప్ లో పంపిస్తున్నామని, ఎండార్స్మెంట్ బై రిజిస్టర్ పోస్ట్ మీరు ఇస్తున్న అడ్రస్ కు పంపిస్తున్నామన్నారు. అర్జీ ఇచ్చేటప్పుడు దానిని కరెక్ట్ గా దానిని పూరించాలన్నారు. రిపీటెడ్ అర్జీదారులు పాత రసీదును తీసుకురావాలన్నారు. జిల్లా ప్రజలుపిజిఆర్ఎస్ కార్యక్రమాన్ని సద్విని యోగం చేసుకోవాలని కోరారు.
” *ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (PGRS)” అర్జీల స్వీకరణ కార్య క్రమాన్ని జిల్లా కేంద్రంతో పాటు మండల, మున్సిపల్ స్థాయిలో కూడా నిర్వహిస్తామన్నారు.
అర్జీదారులు ఈ విషయాన్ని గమనించి తమ ఫిర్యాదులను సమీపంలోని మండల కార్యాలయాలు లేదా మున్సిపల్ కార్యాలయాలలో కూడా సమర్పించుకోవచ్చునన్నారు
డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమం:
డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమాన్ని సోమవారం ఉదయం 9.30 నుండి 10 గంటల వరకు జరుగుతుందన్నారు.ప్రజలు 08562-244437 ల్యాండ్ లైన్ నెంబరుకు ఫోన్ చేసి తమ సమస్యలను విన్నవించుకోవచ్చునన్నారు
ప్రజలు ఈ విషయాన్ని గుర్తించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డీఆర్వో ఆ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.

