డోన్, మహి న్యూస్ ఫిబ్రవరి 15:-
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని నంద్యాల జిల్లా డోన్ పట్టణం కొండపేటకు చెందిన దస్తగిరి (65) తన భక్తిని విశేషంగా చాటుకున్నారు. ఆంజనేయ స్వామి కొండపై ఉన్న దేవాలయానికి 20 లీటర్ల నీటి బిందెను స్వయంగా భుజాన మోసుకుంటూ కొండపైకి చేరుకున్నారు. అనంతరం ఆ నీటితో గడస్తంభానికి, స్వామివారికి అభిషేకం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా దస్తగిరి మాట్లాడుతూ, డోన్ ప్రాంత ప్రజలు అందరూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. ఆయన వయస్సును లెక్కచేయకుండా చూపిన భక్తి, నిబద్ధత స్థానికులను ఆకట్టుకుంది. భక్తి భావంతో కొండపైకి నీరు మోసుకెళ్లి పూజలు నిర్వహించడం పట్ల స్థానికులు దస్తగిరిని అభినందించారు.

