శ్రీకాకుళం, మహి న్యూస్, ఫిబ్రవరి 25:
నగరంలో డయేరియా లక్షణాలతో ఎవరైనా బాధపడుచున్న యెడల వెంటనే నగరంలోని డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ అనుమతి ఉన్న అన్ని హాస్పిటల్స్ లలో డయేరియా పేషెంట్స్ కు ఉచిత వైద్యం అందించబడుతుందని డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ జిల్లా కో ఆర్డినేటర్ డాక్టర్ అవని బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. శ్రీకాకుళం పట్టణంలో ఎవరికైనా డయేరియా లక్షణాలు ఉన్నట్టు అనిపిస్తే తక్షణమే నెట్వర్క్ హాస్పిటల్ కు వెళ్లి ఉచిత వైద్యం పొందాలని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. వైద్యం కొరకు ఎలాంటి సహాయం కావాలన్నా దిగువ ఫోన్ నంబర్లను సంప్రదించాలన్నారు.
టీం లీడర్ 1.:9281068255
టీం లీడర్ 2: 9281068256
టీం లీడర్ 3: 9281068257
జిల్లా సమన్వయ అధికారి డాక్టర్ అవని : 9281068139

