శ్రీకాకుళం, మహి న్యూస్, ఫిబ్రవరి 25:
డయేరియా బాధితులకు మరింత మెరుగైన వైద్యం అందించాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ జెమ్స్ ఆసుపత్రి వైద్యులను ఆదేశించారు. జెమ్స్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న డయేరియా బాధితులను బుధవారం ఆయన సందర్శించారు. వీరిని కలెక్టర్ స్వయంగా వెళ్లి వారికి అందిస్తున్న వైద్యం గూర్చి వైద్యులతో చర్చించారు. పేషెంట్స్ యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని చెప్పారు. ధైర్యంగా ఉండాలని బాధితులకు భరోసా కల్పించారు. అన్ని హాస్పిటల్స్ ల్లో చికిత్స తీసుకుంటున్న వారిలో బుధవారం 13 మందిని డిస్చార్జ్ చేశారు. కలెక్టర్ తో పాటు జెమ్స్ వైద్యులు డాక్టర్ హేమంత్, ఆర్ఎంఓ ప్రవీణ్, తదితర వైద్యులు పాల్గొన్నారు.

