Close Menu
mahinewsindiamahinewsindia
  • Home
  • AndhraPradesh
  • CINIMA
  • Travel

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

వైసీపీ కుట్రలకు భయపడను.. చట్టపరంగా బుద్ధి చెబుతా: టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు

01/03/2026

శ్రీవారిని దర్శించుకున్న సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుర్యకాంత్

01/03/2026

తెప్పపై శ్రీ‌దేవి భూదేవి స‌మేత శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామివారి విహారం

01/03/2026
Facebook X (Twitter) Instagram Threads
Facebook X (Twitter) Instagram
mahinewsindiamahinewsindia
SUBSCRIBE
  • Home
  • AndhraPradesh
  • CINIMA
  • Travel
mahinewsindiamahinewsindia
Home»AndhraPradesh»శ్రీకాకుళం»రైతు నిల్వ సామర్థ్యాల్లో చారిత్రాత్మక ముందడుగు.. ఏఐఎఫ్ తో రాష్ట్రంలో 1000కు పైగా ఆధునిక గోడౌన్లు
శ్రీకాకుళం

రైతు నిల్వ సామర్థ్యాల్లో చారిత్రాత్మక ముందడుగు.. ఏఐఎఫ్ తో రాష్ట్రంలో 1000కు పైగా ఆధునిక గోడౌన్లు

adminBy admin25/02/2026No Comments2 Mins Read
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

అమరావతి, మహి న్యూస్, ఫిబ్ర‌వ‌రి 25:

శాసన మండలిలో వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి (ఏఐఎఫ్) కింద ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు (పీఏసీఎస్)ను బహుళార్థ సాధక సౌకర్య కేంద్రాలు (ఎంపీఎఫ్సీ)లుగా అభివృద్ధి చేసే కార్యక్రమంపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి అచ్చెన్నాయుడు సమగ్రంగా సమాధానం ఇచ్చారు. జూన్ 2020లో కేంద్ర ప్రభుత్వ అగ్రీకల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్(ఏఐఎఫ్) పథకం ద్వారా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిందని, రైతు భరోసా కేంద్రం (ఆర్ఎస్కే) స్థాయిలో నిల్వ మరియు ఆరబెట్టే మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం ప్రధాన లక్ష్యమని ఆయన తెలిపారు. విశాఖపట్నం జిల్లా మినహా రాష్ట్రవ్యాప్తంగా గోడౌన్లు మరియు డ్రైయింగ్ యార్డుల నిర్మాణం జరుగుతోందని, మొత్తం రూ.504.42 కోట్ల వ్యయంతో ఈ పథకం అమలవుతోందని పేర్కొన్నారు. నాబార్డ్ ద్వారా రీఫైనాన్స్ సదుపాయం కల్పించబడుతుందని, పీఏసీఎస్లకు 4% వడ్డీపై 3% వడ్డీ రాయితీ లభిస్తుందని, 90% రుణం మరియు 10% మార్జిన్ మనీ విధానంలో ప్రాజెక్టులు అమలవుతున్నాయని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం మార్జిన్ మనీ కింద రూ.50.4 కోట్లు మంజూరు చేసి అందులో రూ.20 కోట్లు ఇప్పటికే విడుదల చేసిందని, 33 సంవత్సరాల పాటు ఏడాదికి రూ.1 నామమాత్రపు అద్దెకు ప్రభుత్వ భూమి లీజుకు ఇస్తున్నట్లు, రిజిస్ట్రేషన్ ఫీజు మరియు స్టాంపు డ్యూటీ మినహాయింపు కల్పించినట్లు చెప్పారు. ఈ పథకం కింద రుణాలకు ప్రభుత్వ హామీ ఉంటుంద‌ని స్పష్టం చేశారు. ఇప్పటివరకు 1005 ఎంపీఎఫ్సీ గోడౌన్ల పనులు ప్రారంభమై, 717 గోడౌన్లు మరియు అనుబంధ డ్రైయింగ్ యార్డులు పూర్తయ్యాయని, 572 పీఏసీఎస్లో 1111 సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేసి తేమ మీటర్లు, తూనిక బ్యాలెన్స్‌లు, డెస్క్‌టాప్‌లు సరఫరా చేసినట్లు తెలిపారు. 232 పీఏసీఎస్ లలోని 462 అసేయింగ్ కేంద్రాలకు అవసరమైన ల్యాబ్ పరికరాలు అందించామని చెప్పారు. మొత్తం రూ.381.72 కోట్ల విలువైన పనులు పూర్తయ్యాయని, అందులో గోడౌన్ల నిర్మాణానికి రూ.373.97 కోట్లు, పరికరాల సరఫరాకు రూ.7.75 కోట్లు ఖర్చయ్యాయని వెల్లడించారు. ఈ చర్యల ద్వారా రైతులకు శాస్త్రీయ నిల్వ సదుపాయాలు కల్పించి, పంటలకు మెరుగైన ధరలు సాధించే అవకాశాలు పెరుగుతున్నాయని, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ఈ పథకం కీలకంగా నిలుస్తుందని మంత్రి అచ్చెన్నాయుడు మండలికి తెలియజేశారు.

రైతు ఆదాయం పెంపే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం
ఆకాల వర్షాల కారణంగా పంట చేతికి వచ్చే సమయంలో రైతులు ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వం గుర్తించిందని, 2014–19 తెలుగుదేశం ప్ర‌భుత్వ కాలంలో టార్పాలిన్లు పంపిణీ చేశామని, ఆ తరువాత పంపిణీ నిలిచిపోయిందని తెలిపారు. 2024లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో టార్పాలిన్లు కొనుగోలు చేసి ప్రతి రైతు సేవా కేంద్రం (ఆర్ఎస్కే)లో బల్క్‌గా నిల్వ ఉంచామని, ఇంతకుముందు వ్యక్తిగతంగా పంపిణీ చేసేవారమని, ఇప్పుడు అవసరమైన రైతులు ఆర్ఎస్కేల ద్వారా తీసుకుని అవసరం తీరిన తరువాత తిరిగి ఇచ్చే విధానాన్ని అమలు చేస్తున్నామని వివరించారు. వ్యవసాయ రంగంలో సాంకేతికత విస్తృతంగా అభివృద్ధి చెందిందని, ఆధునిక ఎలక్ట్రానిక్ డ్రయర్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నప్పటికీ అవి అధిక వ్యయంతో ఉన్నాయని తెలిపారు. పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మ‌నోహ‌ర్ తో చర్చించి రాష్ట్రంలోని ప్రతి ప్రాంతంలో ఒకటి లేదా రెండు చోట్ల నమూనా ప్రాతిపదికన ఎలక్ట్రానిక్ డ్రయర్లు ఏర్పాటు చేసి, ఫలితాలు అనుకూలంగా ఉంటే రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసే దిశగా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. తడి ధాన్యాన్ని శాస్త్రీయంగా ఎండబెట్టి రైతులకు మెరుగైన ధర లభించేలా చేయడం ప్రభుత్వ లక్ష్యమని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆధునిక డ్రయింగ్ సదుపాయాలు అందుబాటులోకి తీసుకురావడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.

Share. Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
admin
  • Website
  • Facebook
  • X (Twitter)
  • Instagram

Related Posts

డయేరియా ప్రభావిత ప్రాంతాల్లో ఎమ్మెల్యే గొండు శంకర్, జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పర్యటన

25/02/2026

మరింత మెరుగైన వైద్యం అందించండి – జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్

25/02/2026

డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఉచిత వైద్యం

25/02/2026
Leave A Reply Cancel Reply

Our Picks
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo
Don't Miss
AndhraPradesh

వైసీపీ కుట్రలకు భయపడను.. చట్టపరంగా బుద్ధి చెబుతా: టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు

By admin01/03/20260

తిరుమల, మహి న్యూస్, మార్చి 01: సోషల్ మీడియాలో తనపై వస్తున్న అసత్య ఆరోపణలు, మార్ఫింగ్ వీడియోలపై టీటీడీ చైర్మన్…

శ్రీవారిని దర్శించుకున్న సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుర్యకాంత్

01/03/2026

తెప్పపై శ్రీ‌దేవి భూదేవి స‌మేత శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామివారి విహారం

01/03/2026

మార్చి 8న ‘మహిళా దినోత్సవం’ సందర్భంగా ఏపీ ప్రభుత్వం కొత్త పథకాలను ప్రకటించింది:

01/03/2026

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us
About Us

Your source for the lifestyle news. This demo is crafted specifically to exhibit the use of the theme as a lifestyle site. Visit our main page for more demos.

We're accepting new partnerships right now.

Email Us: info@mahinewsindia.com
Contact: 90636 36329

Our Picks
New Comments
    Facebook X (Twitter) Instagram YouTube
    • Home
    • AndhraPradesh
    • Travel
    Designed by Rivx Studios.

    Type above and press Enter to search. Press Esc to cancel.