కర్నూలు, సెప్టెంబర్ 24: (మహి న్యూస్)
గోనెగండ్ల మండలం కులుమాల గ్రామంలో దస్తగిరేయా ఉరుసు కిస్తీ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఉరుసు సందర్భంగా దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి, దస్తగిరేయాను దర్శించుకుని భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు.
ఉరుసు కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. గ్రామంలో ప్రశాంత వాతావరణంలో ఉరుసు వేడుకలు కొనసాగాయి.
ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం కర్నూలు జిల్లా ఉప అధ్యక్షులు కుమ్మరి రామకృష్ణ మరియు జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఎమ్మిగనూరు తాలూకా కార్యదర్శి కుమ్మరి తిరుమల్ పాల్గొనడం జరిగినది .శాలిమియా, ఖాజా, రెహమాన్, ఇమామ్ షా,అక్బర్, పెద్ద ఉసేన్,చిన్న ఉసేన్, కోటకొండ రహంతుల్లా, షేక్షావలి,దస్తగిరి, శ్రీను గౌడ్, గోవింద్,తదితరులు పాల్గొన్నారు. నిర్వాహకులు, గ్రామస్థులు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించారు.
Be the first to share your thoughts on this story!