కడప జిల్లా/జమ్మలమడుగు, మహి న్యూస్ అక్టోబర్ 25
జమ్మలమడుగు మున్సిపాలిటీ పరిధిలోని 17, 18, 19 వార్డుల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గంగమ్మ దేవాలయం సమీపం నుంచి ప్రారంభమైన ప్రచారంలో జమ్మలమడుగు మున్సిపల్ చైర్పర్సన్ అభ్యర్థి చదిపిరాళ్ల జ్యోతి, మాజీ ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి, భూపేష్ రెడ్డి సోదరి ప్రశాంతి పాల్గొని ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలిశారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకుడు జంబాపురం రమణారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు, జనసేన నాయకుడు నాగార్జున, మార్కెట్ యార్డు వైస్ చైర్మన్ మల్లికార్జున పాల్గొన్నారు. అలాగే ఆయా వార్డుల అభ్యర్థులు బండి సుధారాణి, బిర్రు సుగుణమ్మ, శివకుమార్‌తో పాటు ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు ప్రచారంలో పాల్గొన్నారు.
Be the first to share your thoughts on this story!