Friday, 11 September 2026 News that matters, as it happens
Header-2
BREAKING

ప్లాస్టిక్‌ పాపానికి చెక్‌.. డ్రైనేజీలకు శుభ్రత శోభ!

మహి న్యూస్ కథనానికి స్పందన.. క్లీన్‌ అండ్‌ గ్రీన్‌ కార్యక్రమంలో భాగంగా డ్రైనేజీల్లో పేరుకుపోయిన వ్యర్థాల తొలగింపు

Share this Article:


అనంతపురం, మహి న్యూస్, ఆగస్టు 27:   అనంతపురం నగరంలో డ్రైనేజీ కాలువల్లో పేరుకుపోయిన ప్లాస్టిక్‌ వ్యర్థాలు, చెత్తాచెదారం, మురుగు కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై మహి న్యూస్‌ వెలువరించిన “ప్లాస్టిక్‌ పాపం.. డ్రైనేజీలకు శాపం!” కథనానికి స్పందనగా నగరంలో పారిశుద్ధ్య చర్యలు చేపట్టారు.

క్లీన్‌ అండ్‌ గ్రీన్‌ కార్యక్రమంలో భాగంగా గురువారం ఉదయం నగరంలోని పలు ప్రాంతాల్లో డ్రైనేజీ కాలువల్లో పేరుకుపోయిన భారీ మొత్తంలో చెత్తను యంత్రాల సహాయంతో తొలగించే పనులు చేపట్టారు. త్రివేణి సమీపంలోని డ్రైనేజీ కాలువ, సోమనాథ్‌నగర్‌లోని మరువవంక కాలువ, పెన్నార్‌ భవన్‌ పరిసర ప్రాంతాల్లో పేరుకుపోయిన ప్లాస్టిక్‌ కవర్లు, బాటిళ్లు, ఇతర వ్యర్థాలను తొలగిస్తూ కాలువల్లో నీటి ప్రవాహానికి అడ్డం


కులు లేకుం చర్యలు చేపట్టారు.

కాలువల్లో భారీగా పేరుకుపోయిన చెత్త కారణంగా మురుగునీటి ప్రవాహం మందగించడంతో పాటు దుర్వాసన, దోమల సమస్య, పరిసర ప్రాంతాల్లో అపరిశుభ్రత నెలకొంటోంది. వర్షాలు కురిసే సమయంలో ఇలాంటి చెత్త కాలువల్లోనే ఉండిపోతే నీటి ప్రవాహానికి ఆటంకం ఏర్పడి మురుగునీరు రోడ్లపైకి వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. దీంతో డ్రైనేజీలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయడం అత్యవసరంగా మారింది.

WhatsApp Image 2026-08-26 at 7.23.39 PM (1).jpeg
...

మహి న్యూస్‌ కథనం ద్వారా వెలుగులోకి వచ్చిన సమస్యపై సంబంధిత యంత్రాంగం స్పందించి క్షేత్రస్థాయిలో శుభ్రత చర్యలు చేపట్టడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా యంత్రాలతో కాలువల్లోకి చేరి పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించడం వల్ల నీటి ప్రవాహం మెరుగుపడే అవకాశం ఉంది.

అయితే డ్రైనేజీలను ఒకసారి శుభ్రం చేయడంతో సమస్య పూర్తిగా పరిష్కారం కాదని, కాలువల్లోకి ప్లాస్టిక్‌, చెత్త చేరకుండా నిరంతర పర్యవేక్షణ అవసరమని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ప్రజలు కూడా కాలువల్లో చెత్త, ప్లాస్టిక్‌ వేయకుండా బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది.

మహి న్యూస్‌ కథనం.. అధికారుల స్పందన.. క్లీన్‌ అండ్‌ గ్రీన్‌ చర్యలు

WhatsApp Image 2026-08-27 at 11.54.37 AM.jpeg
డ్రైనేజి శుభ్రం చేస్తున్న మునిసిపల్ సిబ్బంది


ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడం మాత్రమే కాకుండా వాటి పరిష్కారానికి సంబంధిత యంత్రాంగం స్పందించేలా చేయడమే ప్రజా పాత్రికేయత లక్ష్యం. తాజాగా డ్రైనేజీ సమస్యపై మహి న్యూస్‌ కథనం అనంతరం శుభ్రత చర్యలు చేపట్టడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది.

“ప్లాస్టిక్‌ను కాలువలో వేయొద్దు.. మన నగరాన్ని మనమే కాపాడుకుందాం” అనే సందేశంతో ప్రజలు కూడా క్లీన్‌ అండ్‌ గ్రీన్‌ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని పలువురు కోరుతున్నారు.

📰
Official Article Source Link
https://mahinewsindia.com/post/83

0 Comments

Leave a Comment
💬 Join Our Official WhatsApp Channel!
Get instant breaking news alerts, exclusive video updates, and top headlines delivered straight to your phone. Follow us on your favorite platforms!
💬 Follow WhatsApp Channel 📺 Subscribe YouTube 📷 Instagram 🪺 Follow X