Tuesday, 27 October 2026 News that matters, as it happens
Header-2
BREAKING

జమ్మలమడుగులో టీడీపీ అభ్యర్థుల తరఫున భూపేష్ రెడ్డి ప్రచారం చదిపిరాళ్ల జ్యోతిని గెలిపించండి.. కూటమి అభ్యర్థులకు ఓటేయండి

ప్రచురణకర్త / Publisher: editor
📅 ప్రచురణ: 25 Oct 2026, 02:17 PM
🔄 నవీకరణ: 27 Oct 2026, 04:27 AM
👁️ 26 views
Share this Article:

కడప జిల్లా/జమ్మలమడుగు, మహి న్యూస్ అక్టోబర్ 25

జమ్మలమడుగు మున్సిపాలిటీ పరిధిలోని 27, 28, 29, 30, 31 వార్డుల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల తరఫున కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు, జమ్మలమడుగు నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జి చదిపిరాళ్ల భూపేష్ సుబ్బరామిరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టెక్కాయచేను వీధిలోని టీటీడీ కల్యాణ మండపం సమీపం నుంచి ప్రారంభమైన ప్రచారంలో ఆయా వార్డుల అభ్యర్థులు అచ్చుకట్ల అన్వర్ అలీ, వెలవలి షేక్ గైబువలి, కొమెర్ల షాహిని, షేక్ హర్షద్, చాపల మాధవి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా భూపేష్ రెడ్డి ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలిసి కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని కోరారు. మున్సిపల్ చైర్‌పర్సన్ అభ్యర్థి చదిపిరాళ్ల జ్యోతికి సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే ఆయా వార్డుల్లో కౌన్సిలర్ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న అభ్యర్థులకు ఓట్లు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు.

జమ్మలమడుగు మున్సిపాలిటీలో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకుని ఓటర్లు తమ నిర్ణయం తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

📰
Official Article Source Link
https://mahinewsindia.com/post/154

0 Comments

+ Leave a Comment

Be the first to share your thoughts on this story!

Leave a Comment
💬 Join Our Official WhatsApp Channel!
Get instant breaking news alerts, exclusive video updates, and top headlines delivered straight to your phone. Follow us on your favorite platforms!
💬 Follow WhatsApp Channel 📺 Subscribe YouTube 📷 Instagram ✈️ Telegram 🪺 Follow X