కడప జిల్లా/ జమ్మలమడుగు మహి న్యూస్ అక్టోబర్ 20
స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ విజయదశమి సందర్భంగా బీజేపీ జిల్లా కార్యదర్శి నగళ్లపాటి శ్రీనివాసులు తన స్వగృహంలో భవానీ అమ్మవారికి యాగం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన కుటుంబ సభ్యులు ఉష, కుమార్తెలు సాత్విక రాయల్, కీర్తిరెడ్డి పాల్గొన్నారు.
రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు ఆదినారాయణరెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు జంగిటి వెంకట సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చదిపిరాళ్ల భూపేష్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా కూటమి విజయాన్ని ఆకాంక్షిస్తూ ప్రార్థనలు చేసినట్లు శ్రీనివాసులు తెలిపారు.
ఈ సందర్భంగా బీజేపీ నాయకులు, కార్యకర్తలతో మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికలు, మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికలు, సర్పంచ్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, పరస్పరం సహకరించుకోవాలని ఆయన కోరారు.
Be the first to share your thoughts on this story!