Sunday, 01 November 2026 News that matters, as it happens
Header-2
BREAKING

12 రకాల గుర్తింపు కార్డులలో ఏ ఒక్కదాన్నయినా తీసుకెళ్లి ఓటు వేయచ్చు

ప్రచురణకర్త / Publisher: editor
📅 ప్రచురణ: 31 Oct 2026, 12:45 PM
🔄 నవీకరణ: 31 Oct 2026, 04:59 PM
👁️ 3 views
Share this Article:

ప్రతి ఓటు విలువైనది..! ఓటు హక్కును సద్వినియోగించుకోండి..!!*

* *జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా. శ్రీధర్ చెరుకూరి*

*నవంబర్ 1న ఉదయం 7 గం౹౹ నుండి సాయంత్రం 5 గం౹౹ ల వరకు మున్సిపల్ ఎన్నికల ఓటింగ్*

కడప, మహి న్యూస్అ క్టోబరు 31: ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటుకు ఎంతో విలువ ఉందని, రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ బాధ్యతగా వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా. శ్రీధర్ చెరుకూరి పిలుపునిచ్చారు.

స్థానిక సంస్థల ఎన్నికలు -2026 లో భాగంగా మున్సిపల్ ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ నవంబర్ 1వ తేదీన (ఆదివారం) ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుందని తెలిపారు. ఓటరు జాబితాలో పేరున్న ప్రతి ఒక్కరూ ఎన్నికల సంఘం గుర్తించిన 12 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒకదానిని వెంట తీసుకుని తమ పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఉత్సాహంగా, బాధ్యతాయుతంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.

ఈ ఎన్నికల్లో ఓటర్లకు రెండు బ్యాలెట్ పత్రాలు అందజేస్తారని, గులాబీ రంగు బ్యాలెట్ పత్రం మేయర్ అభ్యర్థికి, తెలుపు రంగు బ్యాలెట్ పత్రం కార్పొరేటర్ అభ్యర్థికి ఓటు వేసేందుకు ఉంటుందని వివరించారు. ఓటు వేసిన అనంతరం రెండు బ్యాలెట్ పత్రాలను ఒకే బ్యాలెట్ పెట్టెలో వేయాలని తెలిపారు.

జిల్లాలో ఎన్నికలను ప్రశాంతంగా, స్వేచ్ఛగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్ పేర్కొన్నారు. ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా తమకు నచ్చిన అభ్యర్థికి స్వేచ్ఛగా ఓటు వేయాలని, ప్రజాస్వామ్య పండుగలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు.

*ఓటు వేసేందుకు తీసుకెళ్లాల్సిన గుర్తింపు కార్డులు..*

ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు, పాస్‌పోర్టు, తపాలా కార్యాలయ పొదుపు ఖాతా పుస్తకం, ఉపాధి హామీ పథకం గుర్తింపు కార్డు, ఆరోగ్య బీమా కార్డు, పెన్షన్ పత్రం, ఉద్యోగ గుర్తింపు కార్డు, జాతీయ జనాభా పట్టిక స్మార్ట్ కార్డు, ఎంపీ/ ఎమ్మెల్యే/ ఎమ్మెల్సీలకు జారీ చేసిన అధికారిక గుర్తింపు కార్డు, దివ్యాంగుల గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒకదానిని వెంట తీసుకెళ్లాలని జిల్లా కలెక్టర్ సూచించారు.
--------///---------
స.పౌ.సం. శాఖ, వైఎస్సార్ కడప జిల్లా.

📰
Official Article Source Link
https://mahinewsindia.com/post/155

0 Comments

+ Leave a Comment

Be the first to share your thoughts on this story!

Leave a Comment
💬 Join Our Official WhatsApp Channel!
Get instant breaking news alerts, exclusive video updates, and top headlines delivered straight to your phone. Follow us on your favorite platforms!
💬 Follow WhatsApp Channel 📺 Subscribe YouTube 📷 Instagram ✈️ Telegram 🪺 Follow X