Sunday, 02 August 2026
News that matters, as it happens
Header-2
BREAKING

ఆగస్టు 5న కళాశాలల బంద్‌కు ఏబీవీపీ పిలుపు

నంద్యాల, ఆగస్టు 2 (మహి న్యూస్): రాష్ట్రంలోని విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) ఆంధ్రప్రదేశ్ శాఖ ఆగస్టు 5న రాష్ట్రవ్యాప్తంగా కళాశాలల బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా ఏబీవీపీ నంద్యాల జిల్లా కన్వీనర్ లక్ష్మీనరసింహ మాట్లాడుతూ, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. విద్యారంగ అభివృద్ధి, విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని నిర్వహిస్తున్న ఈ బంద్‌కు రాష్ట్రంలోని అన్ని కళాశాలల యాజమాన్యాలు, అధ్యాపకులు, విద్యార్థులు, తల్లిదండ్రులు సహకరించి విజయవంతం చేయాలని కోరారు. విద్యార్థుల హక్కుల సాధన కోసం చేపట్టిన ఈ రాష్ట్రవ్యాప్త బంద్‌కు ప్రతి ఒక్కరూ మద్దతు ఇవ్వాలని ఏబీవీపీ నంద్యాల శాఖ విజ్ఞప్తి చేసింది.

0 Comments

Leave a Comment

Related Stories

Home
Section
More
💬 Join Our Official WhatsApp Channel!
Get instant breaking news alerts, exclusive video updates, and top headlines delivered straight to your phone. Follow us on your favorite platforms!
💬 Follow WhatsApp Channel 📺 Subscribe YouTube 📷 Instagram 🪺 Follow X