కడప, ఆగస్టు 2 (మహి న్యూస్): యూ-డైస్ ప్లస్ (U-DISE Plus) పోర్టల్‌లో ప్రధానోపాధ్యాయుల (హెచ్‌ఎం) లాగిన్ ద్వారా విద్యార్థులు, వారి తల్లిదండ్రుల ఆధార్ నంబర్లను నవీకరించేందుకు ప్రత్యేక ఆప్షన్ అందుబాటులోకి వచ్చింది.
‘తల్లికి వందనం’ పథకం అమలులో భాగంగా విద్యార్థి లేదా తల్లిదండ్రుల ఆధార్ నంబర్లలో ఏవైనా పొరపాట్లు ఉంటే, సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయులను సంప్రదించి వాటిని సరిచేయించుకోవాలని అధికారులు సూచించారు.
పథకం ప్రయోజనాలు సకాలంలో అందుకోవాలంటే ఆధార్ వివరాలు ఖచ్చితంగా ఉండేలా తల్లిదండ్రులు ముందుగానే ధృవీకరించుకోవాలని సూచించారు.
0 Comments