న్యూఢిల్లీ, ఆగస్టు 9( మహి న్యూస్)యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు విధించనున్నారంటూ జరుగుతున్న ప్రచారాన్ని కేంద్ర ప్రభుత్వం ఖండించింది. యూపీఐ వినియోగదారులపై ఎలాంటి ఛార్జీల భారం ఉండదని కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టం చేసింది.
యూపీఐ ద్వారా చెల్లింపులు చేసే వినియోగదారుల నుంచి నేరుగా ఎలాంటి ఛార్జీలు వసూలు చేసే ప్రతిపాదన లేదని కేంద్రం వెల్లడించింది. యూపీఐ చెల్లింపులపై ఛార్జీలకు సంబంధించి సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దని స్పష్టం చేసింది.
ఇదే విషయాన్ని ఇప్పటికే ఫోన్‌పే సంస్థ సీఈవో కూడా వెల్లడించారు. యూపీఐ లావాదేవీలపై వినియోగదారులకు ఛార్జీలు విధించే పరిస్థితి లేదని ఆయన పేర్కొన్నారు.
దీంతో యూపీఐ వినియోగదారులకు ఛార్జీలపై వస్తున్న ఆందోళనలకు కేంద్రం స్పష్టత ఇచ్చినట్లయింది.
0 Comments