Wednesday, 12 August 2026
News that matters, as it happens
Header-2
BREAKING

విద్యారంగ సమస్యల పరిష్కారానికి ‘చలో విజయవాడ’ను జయప్రదం చేయండి

నంద్యాల, ఆగస్టు 12 (మహి న్యూస్)విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం విద్యార్థిలోకం సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలని భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ (యుఎస్‌ఎఫ్‌ఐ) రాష్ట్ర ఉపాధ్యక్షుడు బోరెడ్డి నరసింహారెడ్డి పిలుపునిచ్చారు. ఈ నెల 18న నిర్వహించనున్న ‘చలో విజయవాడ’ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా నరసింహారెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో విద్యారంగాన్ని నిర్వీర్యం చేసే విధానాలను ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల హక్కుల పరిరక్షణ కోసం రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఏకోపాధ్యాయ పాఠశాలల్లో ఏపీ అగ్రస్థానం కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో వెల్లడించిన యూడైస్‌ ప్లస్ గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా 1,00,843 పాఠశాలలు కేవలం ఒక్క ఉపాధ్యాయుడితోనే కొనసాగుతున్నాయని నరసింహారెడ్డి తెలిపారు. ఇందులో ఆంధ్రప్రదేశ్‌లోనే 16,357 ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉండటం ఆందోళనకరమన్నారు. దేశంలోనే అత్యధిక ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉన్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలవడం రాష్ట్రంలోని విద్యావ్యవస్థ పరిస్థితికి అద్దం పడుతోందన్నారు. బీసీ వసతి గృహాల మూసివేతను ఆపాలి రాష్ట్రవ్యాప్తంగా 54 బీసీ సంక్షేమ వసతి గృహాలను మూసివేయడం దారుణమని ఆయన విమర్శించారు. ఉమ్మడి అన్నమయ్య జిల్లాలో 14 బీసీ సంక్షేమ వసతి గృహాలను మూసివేస్తున్న నిర్ణయం తీవ్ర అన్యాయమన్నారు. ముఖ్యంగా కోడూరు డివిజన్ పరిధిలో ఒక్క బీసీ బాలుర వసతి గృహం కూడా లేకపోవడం వల్ల పేద, బీసీ, మైనారిటీ విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. మూసివేత నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే పునఃసమీక్షించి, వసతి గృహాలను యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలి పెండింగ్‌లో ఉన్న విద్యార్థుల స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులకు కనీస మౌలిక వసతులు కల్పించాలని, తాగునీటి కోసం ఆర్‌ఓ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని, దోమతెరలు అందించాలని, ప్రతి నెలా వైద్య పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం చేపట్టే పోరాటాల్లో విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని ‘చలో విజయవాడ’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నరసింహారెడ్డి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యుఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు జయసింహారెడ్డి, జిల్లా కార్యదర్శి సురేంద్ర నాయక్, దేవానంద్ తదితరులు పాల్గొన్నారు. — బోరెడ్డి నరసింహారెడ్డి రాష్ట్ర ఉపాధ్యక్షుడు, భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ (యుఎస్‌ఎఫ్‌ఐ) నంద్యాల జిల్లా కమిటీ

0 Comments

Leave a Comment

Related Stories

Home
Section
More
💬 Join Our Official WhatsApp Channel!
Get instant breaking news alerts, exclusive video updates, and top headlines delivered straight to your phone. Follow us on your favorite platforms!
💬 Follow WhatsApp Channel 📺 Subscribe YouTube 📷 Instagram 🪺 Follow X