గిరిజనులు తమ చట్టాలు, హక్కులపై.. అవగాహన పెంచుకుని అభివృద్ధి పథంలో నడవాలి* * *ప్రపంచ ఆదివాసీ దినోత్సవ సభలో డిఆర్వో మల్లికార్జునుడు
కడప, ఆగస్టు 9 (మహి న్యూస్)భారత ప్రాచీన సంస్కృతీ, సంప్రదాయాల పరిరక్షణలో.. ఆదివాసీ ప్రజల పాత్ర, కృషి, ఫలితం ఎంతో ఉందన్నారు. ప్రకృతితో మమేకమై మఆనుగడ సాగించే ఆదివాసుల జీవనశైలి నాగరిక ప్రపంచానికి ఆదర్శనీయం అని జిల్లా రెవెన్యూ అధికారి కె. మల్లికార్జునుడు౸౸ పేర్కొన్నారు.
ఆదివారం స్థానిక కలెక్టరేట్ పిజిఆర్ఎస్ హాలులో.. జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుక ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా రెవెన్యూ అధికారి కె. మల్లికార్జునుడు తోపాటు.. జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి బ్రహ్మానంద రెడ్డి, డీఎల్ఎస్ఏ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ డిప్యూటీ చీఫ్ ఎం చంద్రకాంతమ్మ, శాంతి హాజరయ్యారు.
** ఈ సందర్భంగా డిఆర్వో మాట్లాడుతూ... మన ప్రాచీన సంస్కృతీ, సంప్రదాయాల పరిరక్షణలో ఆదివాసీ ప్రజల పాత్ర, కృషి, ఫలితం ఎంతో ఉందన్నారు. తోటి ప్రాణికి హాని తలపెట్టకపోవడం, మంచితనం, ఎదుటివారికి సాయం చేయడం.. వంటి సుగుణాలకు కొంత కాలం అదీవాసీలతో కలిసి జీవిస్తే గానీ అర్థం కాదన్నారు. గిరిజనుల సంస్కృతీ సంప్రదాయాలు, జీవన శైలి.. ప్రకృతితో ముడిపడినవని.. అది వారి జీవన విధానం తప్ప అనాగరికత్వం కాదని గుర్తు చేశారు. వారు ఆచరించే మూఢ నమ్మకాల్లో తప్పులుంటే సరిదిద్దాలే తప్ప వారి సంప్రదాయాన్ని తక్కువ చేయకూడదని, వారి వ్యక్తిత్వాన్ని గౌరవించాలన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం గిరిజన సంక్షేమ శాఖ ద్వారా అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి.. ఆదివాసీల ఆర్థికాభివృద్ధికి పెద్దపీట వేసిందన్నారు. రాజ్యాంగ నిర్మాత డా.బి.ఆర్. అంబేద్కర్ గారు అణగారిన అన్ని వర్గాల వారు సామాజికంగా, రాజకీయంగా, ఆర్ధికంగా అభివృద్ధి చెందాలనే భవిష్య వ్యూహంతో.. రాజ్యాంగాన్ని రచించడం జరిగిందన్నారు. అందులో భాగంగానే ఎస్సి, ఎస్టీ, బీసీలకు ప్రత్యేక చట్టాలు, హక్కులను తీసుకువచ్చి వారి అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దోహదపడుతున్నాయన్నారు. ఎస్సి, ఎస్టీ సామాజిక ప్రజల కోసం ప్రత్యేక గ్రీవిన్స్ సెల్ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేస్తామన్నారు.
రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ద్వారా జిల్లాలో గిరిజన ప్రజలకు అనేక రకాల సంక్షేమ పథకాల లబ్ది చేకూర్చడం జరుగుతోందన్నారు. గిరిజనులకు ఎలాంటి అన్యాయం జరగకుండా ఎస్సి, ఎస్టీ అట్రాసిటీ మానిటరింగ్ కమిటీ ద్వారా పర్యవేక్షణ, సహకారం, బాధిత కుటుంబాలకు తక్షణ న్యాయం అందించడం జరుగుతోందన్నారు. గిరిజన సంక్షేమ శాఖ ద్వారా గ్రామీణ, అటవీ కుగ్రామాల స్థాయిలో కూడా గిరిజనులకు ప్రభుత్వం ద్వారా అందాల్సిన అన్ని సంక్షేమ పథకాల గురించి అవగాహన కల్పించడం జరుగుతోందన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అన్ని గిరిజన ప్రాంతాల్లో మౌలిక సౌకర్యాలు కల్పించేలా చర్యలు చేపడుతోందన్నారు. అన్ని హక్కులూ కల్గిన గిరిజన భూములకు ప్రభుత్వం భద్రత కల్పిస్తోందన్నారు. మారుమూల ప్రాంత గిరిజనులకు ఆరోగ్య భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్ లను ఏర్పాటు చేస్తోందన్నారు. గిరిజన హక్కులు, చట్టాలు, ప్రభుత్వం వారికి కల్పించే సంక్షేమ పథకాలపై.. జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అవగాహన అవగాహన కల్పిస్తోందన్నారు.
** జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ.. ప్రకృతికి అతి సన్నిహితంగా ప్రకృతి ఒడిలో, ప్రకృతి వనరులను ఆస్వాదిస్తూ పర్యావరణానికి ఏ మాత్రం హాని కలగకుండా.. ఆరోగ్యకరంగా జీవించే తత్వాన్ని ఆదివాసీల నుండి ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సింది అవసరం ఉందన్నారు. సంహిత జీవన విధానంలో ఆదివాసీలు ప్రపంచానికే ఆదర్శనీయం అన్నారు. ప్రకృతితో ముడిపడివున్న ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలు.. పరిణతి చెందిన మానవజాతి వారసత్వ సంపదగా భవించాలన్నారు.
** డీఎల్ఎస్ఏ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ డిప్యూటీ చీఫ్ ఎం చంద్రకాంతమ్మ, శాంతిలు మాట్లాడుతూ... ప్రపంచం మొత్తం అభివృద్ధి పథంలోకి వచ్చినా.. మానవ జీవన విధానంలో ఎన్నో రకాల అధునాతన సాంకేతిక మార్పులు వచ్చినా.. ఆదివాసీల జీవన శైలి వైవిద్యబరితమైనదన్నారు. ఎస్టీలు అన్ని విధాలుగా తమ హక్కులు, చట్టాల పట్ల అవగాహన పెంచుకుని వారికోసం ప్రభుత్వం అందించే పథకాలను, వనరులను ఉపయోగించుకోవాలన్నారు. గిరిజనుల హక్కులను పరిరక్షించుకునే బాధ్యత వారి చేతుల్లోనే ఉందన్నారు.
ఈ సందర్భంగా పలువురు గిరిజన సంక్షేమ సంఘాల నాయకులు.. వారివారి సామాజిక వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను, వారి అవసరాలను తీర్చాలని కోరుతూ అధికారులకు విన్నవించారు.
ఈ కార్యక్రమానికి ముందుగా.. జిల్లా రెవెన్యూ అధికారి, గౌరవ అతిథులు, గిరిజన నాయకులు జ్యోతి ప్రజ్వలన చేసి.. గిరిజన సంకేమనికి కృషిచేసిన మహనీయుల చిత్ర పటాలను పుష్పాంజలి ఘటించి సభను ప్రారంభించారు.
అనంతరం పలువురు విద్యార్థులు ప్రదర్శించిన బంజారా నృత్య ప్రదర్శనలు, పలువురు గిరిజన సంఘాల నాయకులు పాడిన పాటలు.. చూపరులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
ఈ కార్యక్రమంలో గిరిజన నాయకులు ఎ. మల్లికార్జున, ఎస్సి,ఎస్టీ మానవ హక్కుల వేదిక రాష్ట్ర నాయకులు జె.వి. రమణ, గిరిజన సేవా నాయకులు వేణు గోపాల్ నాయక్, ఎస్టీ ఎంప్లాయిస్ జాతీయ వైస్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్
యానాది నాయకులు శేఖర్ యానాది,
ఎపి సీఆర్పీఎఫ్ నాయకులు అమృ నాయక్, ఏన్టీఎఫ్ జిల్లా అధ్యక్షులు గంగాధర్,
యానాది సంఘం జిల్లా అధ్యక్షులు సురేంద్ర, ఎపి ఎరుకల డెవెలప్మెంట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు పూజారి రెడ్డి శేఖర్, ఆర్ఎస్ఎఫ్ గిరిజన సంక్షేమ సంఘ నాయకులు ఓబులేసు, రామమూర్తి నాయక్, కేద్రి నాయక్, పలువురు ఎస్టీ ఎంప్లాయిస్ అసోసియేషన్ నాయకులు, ఎస్సి, ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు, ఎస్టీ విద్యార్థి సంఘాల నాయకులు, ఎస్టీ సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
0 Comments