మహి న్యూస్దు ర్గి, ఆగస్టు 15: 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని దుర్గి మండల గ్లోరీ జీసస్ పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఫెలోషిప్ అధ్యక్షుడు ఏ. జానయ్య ఆధ్వర్యంలో దుర్గిలోని జెఎంజె వృద్ధాశ్రమంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించి, అక్కడి వృద్ధులకు పండ్లు, స్వీట్లు పంపిణీ చేశారు. వృద్ధులతో కొంత సమయం గడిపి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో సెక్రటరీ జి. ప్రభు కుమార్, ట్రెజరర్ కె. సురేష్, జాయింట్ సెక్రటరీ వెంకట్రావు, ఐ. శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
0 Comments