అనంతపురం జిల్లా/మహి న్యూస్, సెప్టెంబర్ 12:
గుంతకల్లు రైల్వే డివిజన్ పరిధిలోని రైల్వే సమస్యల పరిష్కారానికి అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ ప్రత్యేక చొరవ చూపారు. ఈ మేరకు శనివారం గుంతకల్లులోని డీఆర్ఎం కార్యాలయంలో గుంతకల్లు రైల్వే డివిజన్ డీఆర్ఎం చంద్రశేఖర్ గుప్తాను ఎంపీ మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా గుంతకల్లు రైల్వే డివిజన్ పరిధిలో నెలకొన్న పలు సమస్యలను ఎంపీ డీఆర్ఎం దృష్టికి తీసుకెళ్లారు. ఆయా సమస్యల పరిష్కారం కోసం ఇప్పటికే పలుమార్లు కేంద్ర రైల్వే మంత్రితో పాటు సంబంధిత ఉన్నతాధికారులకు వినతిపత్రాలు సమర్పించిన విషయాన్ని వివరించారు.
ప్రజలకు, ప్రయాణికులకు ఇబ్బందులు కలిగిస్తున్న సమస్యలపై రైల్వే ఉన్నతాధికారులతో జరిగే సమావేశాల్లో మరోసారి ప్రత్యేకంగా ప్రస్తావించాలని ఎంపీ కోరారు. పెండింగ్‌లో ఉన్న సమస్యలను త్వరితగతిన పరిష్కరించేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని డీఆర్ఎంను కోరారు.
గుంతకల్లు రైల్వే డివిజన్ అభివృద్ధి, ప్రయాణికుల సౌకర్యాల మెరుగుదలకు అవసరమైన చర్యలను వేగవంతం చేయాలని ఎంపీ సూచించారు.
0 Comments