Monday, 14 September 2026 News that matters, as it happens
Header-2
BREAKING
పండుగ వేళ ప్రయాణికులపై అదనపు భారం వద్దు! ప్రత్యేక సర్వీసుల పేరుతో 50 శాతం అదనపు చార్జీలు వసూలు చేయడం అన్యాయం: పేరూరు బాలకృష్ణ • కొలనుభారతి ఆలయ అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు దశలవారీగా అభివృద్ధి: ఎమ్మెల్యే గిత్తా జయసూర్య • గుంతకల్లు డీఆర్ఎం కార్యాలయంలో రైల్వే సమస్యలపై చర్చ పెండింగ్‌ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని డీఆర్ఎంను కోరిన ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ • ప్రజలకు అత్యవసర, నాణ్యమైన వైద్య సేవలు మరింత చేరువ : కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు.                     శ్రీకాకుళం జీజీహెచ్‌లో 50 పడకల క్రిటికల్ కేర్ బ్లాక్ ప్రారంభం • రూ.249 కోట్లతో రాష్ట్రంలో 22 వైద్య ప్రాజెక్టులు ప్రారంభం 10 క్రిటికల్ కేర్ బ్లాకులు, 12 సమగ్ర ప్రజారోగ్య ప్రయోగశాలలు అందుబాటులోకి •

వినాయక చవితి ఉత్సవాలను ప్రశాంతంగా, పర్యావరణహితంగా నిర్వహించాలి..!* * *అన్ని శాఖలు సమన్వయంతో ఏర్పాట్లు చేపట్టాలి: కడప ఆర్డీఓ

Share this Article:

కడప, మహి న్యూస్ సెప్టెంబర్ 12: వినాయక చవితి ఉత్సవాలను ప్రజలు భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో, పర్యావరణహితంగా నిర్వహించేలా అన్ని శాఖలు సమన్వయంతో అవసరమైన ఏర్పాట్లు చేపట్టాలని కడప రెవెన్యూ డివిజనల్ అధికారి మురళి సూచించారు.

శనివారం కడప ఆర్డీవో కార్యక్రమంలో వినాయక చవితి ఉత్సవాల నిర్వహణకు సంబంధించి రెవెన్యూ డివిజన్ స్థాయి సమన్వయ కమిటీ సమావేశం ఆర్డీవో మురళి అధ్యక్షతన జరిగింది.

ఈ సందర్భంగా ఉత్సవాల నిర్వహణ, వినాయక విగ్రహాల ఏర్పాటు, నిమజ్జన కార్యక్రమాలపై సంబంధిత శాఖల అధికారులతో ఆర్డీఓ సమీక్షించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు ప్రణాళికతో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు.

వినాయక విగ్రహాల తయారీలో మట్టి విగ్రహాలకు ప్రాధాన్యత ఇవ్వాలని, పర్యావరణానికి హాని కలిగించే పదార్థాల వినియోగాన్ని నివారించాలని సూచించారు. మండపాల ఏర్పాటు, విద్యుత్‌ సరఫరా, భద్రత, పారిశుధ్యం తదితర అంశాల్లో సంబంధిత నిబంధనలు తప్పనిసరిగా పాటించేలా చూడాలన్నారు.

ఉత్సవాల సందర్భంగా అధిక శబ్దం, బాణసంచా వినియోగాన్ని నియంత్రిస్తూ నిర్ణీత నిబంధనలు, సమయాలను పాటించాలని సూచించారు. మండపాల వద్ద విద్యుత్‌ ప్రమాదాలు జరగకుండా విద్యుత్‌ శాఖ అధికారులు ముందస్తు తనిఖీలు నిర్వహించాలని తెలిపారు.

వినాయక విగ్రహాల నిమజ్జనం సందర్భంగా ఊరేగింపుల మార్గాల్లో ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టాలని, నిమజ్జన ప్రాంతాల్లో బారికేడ్లు, తగినంత వెలుతురు, భద్రతా చర్యలు, పారిశుధ్య ఏర్పాట్లు కల్పించాలని ఆర్డీఓ సూచించారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు వైద్య, అగ్నిమాపక సిబ్బంది అందుబాటులో ఉండేలా చూడాలన్నారు.

నిమజ్జనం అనంతరం పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రతను కాపాడేందుకు పారిశుధ్య సిబ్బందితో ప్రత్యేక చర్యలు చేపట్టాలని, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఉత్సవాల నిర్వహణలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అన్ని శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేయాలని ఆర్డీఓ ఆదేశించారు.

ఈ సమావేశంలో మునిసిపల్‌, పోలీసు, విద్యుత్‌, అగ్నిమాపక, వైద్య, పర్యావరణ, ఇంజినీరింగ్‌ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

📰
Official Article Source Link
https://mahinewsindia.com/post/93

0 Comments

Leave a Comment
💬 Join Our Official WhatsApp Channel!
Get instant breaking news alerts, exclusive video updates, and top headlines delivered straight to your phone. Follow us on your favorite platforms!
💬 Follow WhatsApp Channel 📺 Subscribe YouTube 📷 Instagram 🪺 Follow X