Sunday, 13 September 2026 News that matters, as it happens
Header-2
BREAKING
పండుగ వేళ ప్రయాణికులపై అదనపు భారం వద్దు! ప్రత్యేక సర్వీసుల పేరుతో 50 శాతం అదనపు చార్జీలు వసూలు చేయడం అన్యాయం: పేరూరు బాలకృష్ణ • కొలనుభారతి ఆలయ అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు దశలవారీగా అభివృద్ధి: ఎమ్మెల్యే గిత్తా జయసూర్య • గుంతకల్లు డీఆర్ఎం కార్యాలయంలో రైల్వే సమస్యలపై చర్చ పెండింగ్‌ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని డీఆర్ఎంను కోరిన ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ • ప్రజలకు అత్యవసర, నాణ్యమైన వైద్య సేవలు మరింత చేరువ : కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు.                     శ్రీకాకుళం జీజీహెచ్‌లో 50 పడకల క్రిటికల్ కేర్ బ్లాక్ ప్రారంభం • రూ.249 కోట్లతో రాష్ట్రంలో 22 వైద్య ప్రాజెక్టులు ప్రారంభం 10 క్రిటికల్ కేర్ బ్లాకులు, 12 సమగ్ర ప్రజారోగ్య ప్రయోగశాలలు అందుబాటులోకి •

పండుగ వేళ ప్రయాణికులపై అదనపు భారం వద్దు! ప్రత్యేక సర్వీసుల పేరుతో 50 శాతం అదనపు చార్జీలు వసూలు చేయడం అన్యాయం: పేరూరు బాలకృష్ణ

Share this Article:

హైదరాబాద్, మహి న్యూస్ September 13 

వినాయక చవితి పండుగ సందర్భంగా సొంత ఊళ్లకు వెళ్లే ప్రయాణికులపై ఆర్టీసీ అదనపు చార్జీలు వసూలు చేయడం అన్యాయమని కన్స్యూమర్ రైట్స్ కౌన్సిల్ జాతీయ అధికార ప్రతినిధి పేరూరు బాలకృష్ణ అన్నారు.

పండుగ, వరుస సెలవుల నేపథ్యంలో లక్షలాది మంది ప్రజలు స్వగ్రామాలకు తరలివెళ్తున్నారని, ఈ సమయంలో ప్రజలకు సురక్షితమైన, అందుబాటులో ఉండే రవాణా సేవలు అందించాల్సిన ఆర్టీసీ ప్రత్యేక సర్వీసుల పేరుతో 50 శాతం అదనపు చార్జీలు వసూలు చేయడం ప్రజలపై ఆర్థిక భారాన్ని మోపడమేనని పేర్కొన్నారు.

పండుగ వేళ ప్రజల అవసరాన్ని అవకాశంగా తీసుకుని అదనపు చార్జీలు వసూలు చేయడం సరికాదని అన్నారు. ఇప్పటికే ప్రయాణ ఖర్చులతో ఇబ్బందులు పడుతున్న ప్రజలపై మరింత భారం మోపకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.

ప్రత్యేక సర్వీసుల నిర్వహణతో పాటు అదనపు చార్జీల భారాన్ని తగ్గించి ప్రయాణికులకు ఊరట కల్పించాలని సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులను పేరూరు బాలకృష్ణ కోరారు. ప్రజల నెత్తిన అదనపు భారం వేయకుండా పండుగ సమయంలో ప్రజా రవాణాను మరింత అందుబాటులోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు.

📰
Official Article Source Link
https://mahinewsindia.com/post/98

0 Comments

Leave a Comment
💬 Join Our Official WhatsApp Channel!
Get instant breaking news alerts, exclusive video updates, and top headlines delivered straight to your phone. Follow us on your favorite platforms!
💬 Follow WhatsApp Channel 📺 Subscribe YouTube 📷 Instagram 🪺 Follow X