Author: editor

పి గన్నవరం, మహి న్యూస్,ఫిబ్రవరి08: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, పి. గన్నవరం మండలం, జి. పెదపూడి గ్రామంలో డొక్కా సీతమ్మ ఫెడ్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అగ్రికల్చర్ డ్రోన్‌ను పి. గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు గిడ్డి సత్యనారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రైతుల మేలు లక్ష్యంగా అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని తెలిపారు. వ్యవసాయానికి అవసరమైన యంత్ర పరికరాలు, అగ్రికల్చర్ రోడ్లు, పవర్ టిల్లర్లు తదితరాలను సబ్సిడీ కింద రైతులకు అందిస్తున్నామని అన్నారు.ఈ అగ్రికల్చర్ డ్రోన్ మొత్తం విలువ రూ.9 లక్షల 84 వేలు కాగా, ఇందులో రూ.7 లక్షల 84 వేలు ప్రభుత్వ సబ్సిడీగా లభిస్తుందని, రైతులు కేవలం రూ.2 లక్షలు మాత్రమే వెచ్చించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. రైతును రాజుగా భావించే కూటమి ప్రభుత్వం 80 శాతం సబ్సిడీతో డ్రోన్లను అందిస్తున్నదని…

Read More

అనంతపురం మహి న్యూస్ ఫిబ్రవరి 08 డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి మరియు చేనేత పరిశ్రమ మధ్య ఉన్న అనుబంధం కేవలం రాజకీయ సంబంధం కాదు. అది చేనేత కళాకారుల జీవనంతో ముడిపడిన చారిత్రక బంధం. ఈ నిజం నేటి తరం ప్రజలకు, ముఖ్యంగా యువతకు పూర్తిగా తెలియకపోవడం దురదృష్టకరం.1992లో రాజకీయంగా ముఖ్యమంత్రి కావాల్సిన అర్హతలు, పరిస్థితులు ఉన్నప్పటికీ, కాంగ్రెస్ పార్టీ అంతర్గత రాజకీయాల కారణంగా వైఎస్ రాజశేఖరరెడ్డికి ఆ అవకాశం దక్కలేదు. అదే సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దేశంలోనే రెండవ అతిపెద్ద రాష్ట్ర చేనేత సహకార సంఘ పాలకవర్గానికి జరిగిన ఎన్నికల్లో, 23 జిల్లాల నుంచి పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థులే డైరెక్టర్లుగా గెలిచి, చేనేత చరిత్రలో అరుదైన విజయాన్ని నమోదు చేశారు.ఆప్కో చైర్మన్ పదవికి వైఎస్ రాజశేఖరరెడ్డి కడప జిల్లాకు చెందిన బండి హనుమంతును ప్రతిపాదించారు. అయితే అప్పటి ముఖ్యమంత్రి ఈ ప్రతిపాదనను తిరస్కరించి, అదిలాబాద్‌కు చెందిన నాగయ్య…

Read More

జిల్లా ఇన్చార్జి మంత్రి సవిత ’ స్వచ్ఛాంధ్రే కూటమి ప్రభుత్వ లక్ష్యం ఇళ్ల ముంగిటకే స్వచ్ఛ రథాలు పొడి చెత్తకు విలువ కట్టి 20 రకాల నిత్యావసర వస్తువులు ఇస్తున్నాం తడి చెత్తతో సేంద్రీయ ఎరువుల తయారీ చెత్త కేంద్రాలతో పంచాయతీలకు ఆదాయం చెత్త తో సంపద సృష్టించిన ఘనత సీఎం చంద్రబాబుదే జిల్లా ఇన్చార్జి మంత్రి సవిత స్వచ్ఛ రథాన్ని జెండా ప్రారంభించిన జిల్లా ఇన్చార్జి మంత్రి సవిత కడప జిల్లా చెన్నూరు/కమలాపురం, మహి న్యూస్ ఫిబ్రవరి 07 : తమ ప్రభుత్వం చెత్త ద్వారా సంపద సృష్టించి ప్రజలకు ఆదాయం మార్గం చూపించామని జిల్లా ఇన్చార్జి మంత్రి, రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. శనివారం జిల్లా ఇన్చార్జి మంత్రి మరియు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి వైఎస్ఆర్ కడప జిల్లా ఒక రోజు పర్యటనలో భాగంగా చెన్నూరు…

Read More

వై.ఎస్.ఆర్. కడప, మహి న్యూస్ ఫిబ్రవరి 07: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ఆధ్వర్యంలో ఈ నెల 09 నుండి 11 తేదీల వరకు నిర్వహించనున్న ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ మరియు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్–III పోస్టుల నియామక పరీక్షలను పటిష్టంగా, పారదర్శకంగా నిర్వహించాలని ఇంచార్జి జిల్లా రెవిన్యూ అధికారి వెంకటపతి ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లోని జిల్లా రెవిన్యూ అధికారి ఛాంబర్‌లో పరీక్షల నిర్వహణపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా రెవిన్యూ అధికారి మాట్లాడుతూ, జిల్లాలోని మూడు పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా సజావుగా నిర్వహించాలన్నారు. అభ్యర్థులను ఉదయం 08.00 నుండి 08.45 గంటల వరకు, మధ్యాహ్నం 01.00 నుండి 01.45 గంటల వరకు మాత్రమే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించాలని సూచించారు. పరీక్షా కేంద్రాల్లో మాల్‌ప్రాక్టీస్‌కు అవకాశం లేకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని, లైజన్ ఆఫీసర్లు, చీఫ్…

Read More

కడప, మహి న్యూస్ ఫిబ్రవరి 7 : జిల్లాలో పెండింగ్ లోవున్న అన్ని రకాల ఎన్ఆర్ఈజీఎస్ పనులను.. ఈ ఆర్థిక సవత్సరంలోగా పూర్తి చేయాలని.. జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి సంబంధిత శాఖల ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. శనివారం జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో.. ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా జిల్లాలో జరుగుతున్న వివిధ రకాల అభివృద్ధి పనుల పురోగతిపై.. ఎన్ఆర్ఈజీఎస్, పంచాయతీ రాజ్ శాఖ ఇంజినీరింగ్ అధికారులతో జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… జిల్లా అభివృద్ధిలో భాగంగా.. ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా జిల్లాలో జరుగుతున్న వివిధ రకాల అభివృద్ధి పనులను ఈ ఆర్థిక సంవత్సరంలోగా ప్రత్యేకించి మార్చి 15 లోగా పూర్తి చేయాలన్నారు. 100% పూర్తి చేయగల పనులను గుర్తించి వారం రోజుల్లోగా ప్రారంభించేలా చర్యలు చేపట్టాలన్నారు. ఈ ఆర్థిక సంవత్సరానికి జిల్లాలో ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా 2059 పనులు మంజూరయ్యాయని..ఇప్పటికే…

Read More

మహి న్యూస్ రామగిరి, శ్రీ సత్య సాయి జిల్లా జనవరి 31: శ్రీ సత్య సాయి జిల్లా రామగిరి మండలం నసనకోట పంచాయతీలో రాప్తాడు శాసన సభ్యురాలు పరిటాల సునీత శనివారం ఎన్టీఆర్ పెన్షన్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు, టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు

Read More