Tuesday, 27 October 2026 News that matters, as it happens
Header-2
BREAKING

ఆటో డ్రైవర్లకు రోడ్డు భద్రతపై అవగాహన

ప్రచురణకర్త / Publisher: EDITOR
📍 నరసరావుపేట
📅 ప్రచురణ: 19 Sep 2026, 08:15 AM
🔄 నవీకరణ: 04 Oct 2026, 09:53 AM
👁️ 10 views
Share this Article:

నరసరావుపేట, మహి న్యూస్, సెప్టెంబర్ 18:

నరసరావుపేట జిల్లా రవాణా అధికారి కార్యాలయంలో ఆటో డ్రైవర్లకు రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

జిల్లా రవాణా అధికారి మాట్లాడుతూ ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, యూనిఫాం ధరించాలని, అధిక లోడుతో ప్రయాణికులను తరలించకూడదని, మద్యం సేవించి వాహనం నడపకూడదని సూచించారు. డ్రైవింగ్ లైసెన్స్, ఆర్‌సీ, బీమా, ఫిట్‌నెస్, అనుమతి పత్రాలను తప్పనిసరిగా కలిగి ఉండాలని తెలిపారు. ఇటీవల జరిగిన చిలకలూరిపేట ఆటో ప్రమాదంపై కూడా డ్రైవర్లకు అవగాహన కల్పించారు.

ట్రాఫిక్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఎం. లోకనాథం మాట్లాడుతూ వేగ పరిమితి, లేన్ క్రమశిక్షణ పాటించాలని, వాహనం నడుపుతూ సెల్‌ఫోన్ ఉపయోగించకూడదని సూచించారు. మీటర్, చార్జీల పట్టికను ప్రదర్శించాలని, పాఠశాల విద్యార్థులను అధిక సంఖ్యలో తరలించకూడదని, ప్రయాణికులతో మర్యాదగా వ్యవహరించాలని తెలిపారు.

మోటార్ వాహన తనిఖీ అధికారులు వాహనాల ఫిట్‌నెస్‌ సక్రమంగా ఉండేలా చూసుకోవాలని, గడువు ముగిసేలోపు పత్రాలను పునరుద్ధరించుకోవాలని సూచించారు. రోడ్డు భద్రతపై కరపత్రాలను పంపిణీ చేశారు.

రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఆటో డ్రైవర్ బాధ్యతగా వ్యవహరించి సహకరించాలని జిల్లా రవాణా అధికారి కోరారు. కార్యక్రమంలో మోటార్ వాహన తనిఖీ అధికారులు ఎన్. శివనాగేశ్వరరావు, కె. కరుణాకరన్, వంశీకృష్ణతో పాటు 150 మందికి పైగా ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు.


📰
Official Article Source Link
https://mahinewsindia.com/post/100

0 Comments

+ Leave a Comment

Be the first to share your thoughts on this story!

Leave a Comment
💬 Join Our Official WhatsApp Channel!
Get instant breaking news alerts, exclusive video updates, and top headlines delivered straight to your phone. Follow us on your favorite platforms!
💬 Follow WhatsApp Channel 📺 Subscribe YouTube 📷 Instagram ✈️ Telegram 🪺 Follow X