Tuesday, 27 October 2026 News that matters, as it happens
Header-2
BREAKING

పిఎం శ్రీ కడప కేంద్రీయ విద్యాలయ పనితీరుపై జాయింట్ సెక్రటరీ ప్రశంసలు..! 100 శాతం ఉత్తీర్ణత, క్రమశిక్షణతో కూడిన విద్యాబోధన అభినందనీయం

ప్రచురణకర్త / Publisher: EDITOR
📍 కడప
📅 ప్రచురణ: 20 Sep 2026, 11:45 AM
🔄 నవీకరణ: 18 Oct 2026, 09:04 PM
👁️ 13 views
Share this Article:

కడప, మహి న్యూస్ సెప్టెంబర్ 20 : పిఎం శ్రీ పథకం కింద కడప కేంద్రీయ విద్యాలయంలో విద్యా సంస్కరణలను సమర్థవంతంగా అమలు చేస్తూ, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తున్న తీరుపై.. భారత ప్రభుత్వ జాయింట్ సెక్రటరీ శ్రీ రజత్ కుమార్ సైని ప్రశంసలు కురిపించారు. పాఠశాలలో 100 శాతం ఉత్తీర్ణత సాధించడం, క్రమశిక్షణతో కూడిన విద్యాబోధన, విద్యార్థుల సమగ్ర వికాసానికి చేపడుతున్న కార్యక్రమాలు అభినందనీయమని పేర్కొన్నారు.

పిఎం శ్రీ పథకం అమలు తీరు, పాఠశాల విద్యా ప్రమాణాలు, మౌలిక సదుపాయాలు, బోధనా విధానాలను సమీక్షించేందుకు కడప కేంద్రీయ విద్యాలయాన్ని సందర్శించిన జాయింట్ సెక్రటరీ శ్రీ రజత్ కుమార్ సైని సమగ్ర తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీ మునేష్ మీనా పనితీరును ప్రత్యేకంగా అభినందించారు.

పాఠశాల ఆవరణ, మౌలిక సదుపాయాలు, పరిశుభ్రత, విద్యార్థులకు అనుకూలమైన అభ్యసనా వాతావరణం సంతృప్తికరంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. డిజిటల్ విద్యకు ప్రాధాన్యతనిస్తూ పాఠశాలలో 59 కంప్యూటర్లు, 17 స్మార్ట్ తరగతి గదులు అందుబాటులో ఉండటం, ఉపాధ్యాయులు డిజిటల్ బోధనా పద్ధతులతో పాటు దీక్షా వేదికను క్రమం తప్పకుండా వినియోగించడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.

జాతీయ విద్యా విధానం-2020కు అనుగుణంగా విద్యార్థులకు ఆహ్లాదకరమైన, కృత్యాధారిత బోధన అందించడం, జాదూయీ పిటారా వినియోగం, కృత్రిమ మేధస్సు ఆధారిత నైపుణ్య విద్యను అందిస్తున్న విధానాన్ని ఆయన ప్రశంసించారు. విద్యార్థుల్లో శాస్త్రీయ ఆలోచన, సృజనాత్మకత పెంపొందించేలా రాష్ట్రీయ ఆవిష్కార్ అభియాన్, ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమాల ద్వారా విజ్ఞాన యాత్రలు నిర్వహించడం కూడా అభినందనీయమన్నారు.

విద్యార్థుల సౌకర్యాలను మరింత మెరుగుపరిచేలా పాఠశాలలో కొనసాగుతున్న మరమ్మత్తు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. నూతన మార్గదర్శకాలను పాటిస్తూ పాఠశాల అభివృద్ధి, విద్యార్థుల సౌకర్యాలపై నిరంతరం దృష్టి సారించాలని సూచించారు.

కడప కేంద్రీయ విద్యాలయం సాధిస్తున్న ప్రగతిపై జాయింట్ సెక్రటరీ శ్రీ రజత్ కుమార్ సైని ఉపాధ్యాయ బృందాన్ని, ప్రిన్సిపాల్ శ్రీ మునేష్ మీనాను అభినందించారు. విద్యార్థుల విద్యా ప్రమాణాలను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు ఇదే స్ఫూర్తితో పనిచేయాలని సూచించారు.

కార్యక్రమంలో సబ్ కలెక్టర్ హెచ్ ఎస్. భావన, డీఈవో శంశుద్దీన్,
కేవీ కడప టీచింగ్ స్టాఫ్ తదితరులు పాల్గొన్నారు.

📰
Official Article Source Link
https://mahinewsindia.com/post/104

0 Comments

+ Leave a Comment

Be the first to share your thoughts on this story!

Leave a Comment
💬 Join Our Official WhatsApp Channel!
Get instant breaking news alerts, exclusive video updates, and top headlines delivered straight to your phone. Follow us on your favorite platforms!
💬 Follow WhatsApp Channel 📺 Subscribe YouTube 📷 Instagram ✈️ Telegram 🪺 Follow X