Tuesday, 27 October 2026 News that matters, as it happens
Header-2
BREAKING

ఘనంగా శ్రీ సిద్ధి వినాయక గణపతి నవరాత్రి మహోత్సవాలు.

ప్రచురణకర్త / Publisher: EDITOR
📍 తాళ్లరేవు
📅 ప్రచురణ: 27 Sep 2026, 08:36 AM
🔄 నవీకరణ: 19 Oct 2026, 05:45 AM
👁️ 10 views
Share this Article:

తాళ్లరేవు, మహి న్యూస్, సెప్టెంబర్ 26:

మండల పరిధిలోని సుంకరపాలెం చెక్‌పోస్ట్ వీధిలోని రామాలయం వద్ద నిర్వహించిన శ్రీ సిద్ధి వినాయక గణపతి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నవరాత్రి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించారు.
ఉత్సవాల్లో భాగంగా చివరి రోజు గణపతి స్వామివారి లడ్డూలను వేలం వేశారు. వేలం పాటలో మాజీ ఎంపీటీసీ గుత్తుల శ్రీనివాస్ రూ.15,500, గుత్తుల వీర వెంకట సత్యనారాయణ రూ.32,000, గురజాపు మసేన్ రూ.15,000, కాజా నాగేశ్వరరావు రూ.6,000, గుత్తుల శ్రీనివాస్ చిన్న అప్పారావు రూ.7,500 చొప్పున లడ్డూలను దక్కించుకున్నారు.
లడ్డూ వేలంలో పాల్గొని లడ్డూలను దక్కించుకున్న భక్తులను ఆలయ కమిటీ ప్రతినిధులు ఘనంగా సత్కరించి అభినందించారు.
అనంతరం ఆలయం వద్ద భారీ అన్నసమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా గణపతి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అన్నసమారాధన ప్రారంభించారు. పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు, గ్రామ పెద్దలు, యువత, మహిళలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

📰
Official Article Source Link
https://mahinewsindia.com/post/116

0 Comments

+ Leave a Comment

Be the first to share your thoughts on this story!

Leave a Comment
💬 Join Our Official WhatsApp Channel!
Get instant breaking news alerts, exclusive video updates, and top headlines delivered straight to your phone. Follow us on your favorite platforms!
💬 Follow WhatsApp Channel 📺 Subscribe YouTube 📷 Instagram ✈️ Telegram 🪺 Follow X