సూళ్ళూరుపేట, సెప్టెంబర్ 26, మహి న్యూస్:
తిరుపతి జిల్లా, సూళ్లూరుపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ విజయ ఘంట మోగించడమే కాకుండా, రాబోయే రోజుల్లో తిరుగులేని శక్తిగా ఎదుగుతోందని పార్టీ శ్రేణులు అభిప్రాయపడుతున్నారు. పార్టీ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా తెలుగుదేశం పార్టీ తరఫున సూళ్లూరుపేట శాసనసభ్యురాలిగా గెలుపొందిన డాక్టర్ నెలవల విజయశ్రీ నియోజకవర్గ నాయకత్వానికి సరికొత్త రూపురేఖలు దిద్దుతున్నారు. విజయం సాధించిన తొలిరోజు నుంచే ప్రజల్లో ఉంటూ, నిత్యం ప్రజాక్షేత్రంలో పర్యటిస్తూ అందరి ప్రశంసలు అందుకుంటున్నారు.
కేడర్‌కు అండగా, కార్యకర్తలకు కొండంత బలంగా..
రాజకీయాల్లో నాయకుని బలం కార్యకర్తలే అని నమ్మే ఎమ్మెల్యే విజయశ్రీ కేడర్‌ను కాపాడుకోవడంలో ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. నియోజకవర్గంలోని ప్రతి కార్యకర్తకూ ఏ కష్టం వచ్చినా "నేనున్నాను" అనే భరోసానిస్తున్నారు. నిత్యం ప్రజలకు, కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ వారి బాధలను నేరుగా విని పరిష్కరించే దిశగా అడుగులు వేస్తున్నారు. శ్రేణుల్లో ఉత్సాహం నింపుతూ, నాయకులను, కార్యకర్తలను ఒకే తాటిపైకి తెస్తూ పార్టీని బూత్ స్థాయి నుంచి మరింత బలోపేతం చేస్తున్నారు.
సమస్య ఏదైనా, తక్షణమే స్పందన.
మంచినీటి సమస్య, రహదారుల పునర్నిర్మాణం, డ్రైనేజీ వ్యవస్థ లేదా స్థానిక ప్రభుత్వ కార్యాలయాల్లో ఎదురయ్యే ఇబ్బందులు. సమస్య చిన్నదా, పెద్దదా అని చూడకుండా ప్రతి విషయంపైనా ఆమె సానుకూలంగా స్పందిస్తున్నారు. అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ, ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యాన్ని సహించేది లేదని స్పష్టం చేస్తున్నారు. ప్రజా సమస్యలపై వెంటనే స్పందించే ఆమె శైలి నియోజకవర్గ ప్రజల మనసులను గెలుచుకుంటోంది.
స్థానిక పోరుకు సమిష్టి వ్యూహంతో గెలుపే ఏకైక ధ్యేయం.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జెండాను ఎగరవేసేందుకు ఎమ్యెల్యే విజయశ్రీ ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తున్నారు. నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలతో సమన్వయం సాధిస్తూ సమిష్టి కృషితో ముందుకు సాగుతున్నారు. సూళ్లూరుపేట కోటపై టీడీపీ ఎప్పటికీ తిరుగులేని శక్తిగా నిలవాలనే సంకల్పంతో గ్రామ గ్రామాన పర్యటిస్తూ, ప్రజల అవసరాలు తీరుస్తూ జనం మెచ్చిన మహిళా శక్తిగా దూసుకుపోతున్నారు. మహిళా నాయకురాలిగా, వైద్యురాలిగా, ప్రజాప్రతినిధిగా ప్రజా సంక్షేమమే పరమావధిగా పనిచేస్తున్న డాక్టర్ నెలవల విజయశ్రీ నాయకత్వంలో సూళ్లూరుపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి సరికొత్త ప్రజాదరణ లభిస్తోందని స్థానిక ప్రజలు, పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Be the first to share your thoughts on this story!