Wednesday, 28 October 2026 News that matters, as it happens
Header-2
BREAKING

ఓజిలి రెవెన్యూ కార్యాలయంలో ‘సర్వే’ దందా.

ప్రచురణకర్త / Publisher: EDITOR
📍 ఓజిలి
📅 ప్రచురణ: 27 Sep 2026, 10:13 AM
🔄 నవీకరణ: 18 Oct 2026, 11:10 PM
👁️ 10 views
Share this Article:

ఓజిలి, సెప్టెంబర్ 25, మహి న్యూస్:

రైతులకు, సామాన్య ప్రజలకు అండగా నిలవాల్సిన రెవెన్యూ యంత్రాంగం ఓజిలి మండలంలో అవినీతి అడ్డాగా మారిందనే విమర్శలు తీవ్రమవుతున్నాయి. భూముల సరిహద్దుల గుర్తింపు, సబ్ డివిజన్ల కోసం దరఖాస్తు చేసుకున్న సామాన్యులను కొందరు సర్వే అధికారులు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. కార్యాలయానికి వచ్చే దరఖాస్తుదారుల నుండి నిస్సిగ్గుగా డబ్బులు డిమాండ్ చేస్తూ, "మామూళ్లు" ఇచ్చుకున్న వారికే మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారని బాధితులు వాపోతున్నారు.

మండలంలో ప్రాంతాన్ని బట్టి రేట్లు ఫిక్స్!

బాధితులు మరియు స్థానికుల కథనం ప్రకారం, ఓజిలి మండల రెవెన్యూ కార్యాలయంలో సర్వే నివేదిక ఇవ్వడానికి ఒక నిర్దిష్ట ధరల పట్టిక నడుస్తోంది. భూమి ఉన్న ప్రాంతం, దాని విలువ మరియు దరఖాస్తుదారుడి అవసరాన్ని బట్టి రూ. 1,500 నుండి రూ. 10,000 వరకు లంచం వసూలు చేస్తున్నట్లు, ప్రభుత్వ నిబంధనల ప్రకారం చెల్లించాల్సిన అధికారిక చలానా రుసుము ఏమోగానీ, ఈ అదనపు వసూళ్లు ఇవ్వనిదే ఫైలు ముందుకు కదలడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

డబ్బులిస్తేనే ప్రాధాన్యత.. లేదంటే అంతులేని ఆలస్యం!

ముందుగా దరఖాస్తు చేసుకున్న వాటిని పక్కనబెట్టి, లంచాలు ఇచ్చిన వారి దరఖాస్తులకే అధికారులు అత్యంత వేగంగా సర్వేలు పూర్తి చేసి రిపోర్టులు ఇస్తున్నారని, లంచం ఇవ్వడానికి నిరాకరించిన, ఆలస్యం చేసిన వారి దరఖాస్తులను నెలల తరబడి పెండింగ్‌లో పెడుతున్నారని, కొన్ని సందర్భాల్లో సాంకేతిక కారణాలు సాకుగా చూపి తిరస్కరిస్తున్నారని బాధితులు పేర్కొంటున్నారు.

ఉన్నతాధికారులు స్పందించాలి.

మండల కేంద్రంలో బహిరంగంగానే సాగుతున్న ఈ అవినీతి దందాపై జిల్లా కలెక్టర్ మరియు రెవెన్యూ ఉన్నతాధికారులు తక్షణమే స్పందించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఓజిలి మండల సర్వే విభాగంలో జరుగుతున్న అక్రమాలపై ప్రత్యేక నిఘా ఉంచి, అన్నీ రికార్డులను పరిశీలించి, బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని, సామాన్య రైతులకు న్యాయం చేయాలని మండల ప్రజలు కోరుతున్నారు.

📰
Official Article Source Link
https://mahinewsindia.com/post/120

0 Comments

+ Leave a Comment

Be the first to share your thoughts on this story!

Leave a Comment
💬 Join Our Official WhatsApp Channel!
Get instant breaking news alerts, exclusive video updates, and top headlines delivered straight to your phone. Follow us on your favorite platforms!
💬 Follow WhatsApp Channel 📺 Subscribe YouTube 📷 Instagram ✈️ Telegram 🪺 Follow X