కల్లూరు మండలం, సెప్టెంబర్ 29: (మహి న్యూస్)
వర్షాభావంతో పంటలు నష్టపోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులను ఆదుకునేందుకు కల్లూరు మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి, రామకృష్ణ డిమాండ్ చేశారు.
మంగళవారం కల్లూరు మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద రైతుల సమస్యలపై వినతిపత్రం అందజేశారు. మండలంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, రైతుల నష్టాలను అంచనా వేయాలని కోరారు.
కల్లూరు మండలాన్ని కరువు మండలంగా ప్రకటించడంతో పాటు, పంటలు నష్టపోయిన రైతులకు నష్టపరిహారం, అవసరమైన సహాయక చర్యలు వెంటనే అందించాలని రామకృష్ణ డిమాండ్ చేశారు.
ఈ మేరకు జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేయాలని కోరుతూ తహసీల్దార్ కార్యాలయంలో ఆర్.ఐ. రంగస్వామికి వినతిపత్రం సమర్పించారు.
Be the first to share your thoughts on this story!