Tuesday, 27 October 2026 News that matters, as it happens
Header-2
BREAKING

దొరవారిసత్రం తహసిల్దార్ కార్యాలయంలో గాంధీ జయంతి.

ప్రచురణకర్త / Publisher: KADAPA
📍 దొరవారిసత్రం
📅 ప్రచురణ: 02 Oct 2026, 12:01 PM
🔄 నవీకరణ: 19 Oct 2026, 07:58 AM
👁️ 61 views
Share this Article:
Story Highlights

సత్యం–అహింసే గాంధీజీ బాట:ఎమ్మార్వో రాజేంద్ర.

దొరవారిసత్రం, అక్టోబర్ 2, మహి న్యూస్: మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా దొరవారిసత్రం తహసిల్దార్ కార్యాలయంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. తహసిల్దార్ రాజేంద్ర గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా గాంధీజీ దేశానికి చేసిన సేవలను స్మరించుకున్నారు. సత్యం, అహింస, శాంతి మార్గాలను గాంధీజీ ప్రపంచానికి చాటిచెప్పారని తహసిల్దార్ పేర్కొన్నారు. ఆయన ఆశయాలు నేటి సమాజానికి కూడా ఎంతో ప్రేరణనిస్తాయని అన్నారు. ప్రతి ఒక్కరూ గాంధీజీ సిద్ధాంతాలను జీవితంలో ఆచరించాలని సూచించారు. ప్రజల్లో శాంతి, సామరస్యం, సోదరభావం పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు. దేశ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని పిలుపునిచ్చారు. అనంతరం రెవెన్యూ అధికారులు, సిబ్బంది గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. కార్యక్రమంలో తహసిల్దార్ కార్యాలయ అధికారులు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

📰
Official Article Source Link
https://mahinewsindia.com/post/128

0 Comments

+ Leave a Comment

Be the first to share your thoughts on this story!

Leave a Comment
💬 Join Our Official WhatsApp Channel!
Get instant breaking news alerts, exclusive video updates, and top headlines delivered straight to your phone. Follow us on your favorite platforms!
💬 Follow WhatsApp Channel 📺 Subscribe YouTube 📷 Instagram ✈️ Telegram 🪺 Follow X