తిరుపతి జిల్లా ఓజిలి మండలం సగుటూరు పంచాయతీలో ప్రజాధనాన్ని రక్షించాల్సిన అధికారులే భక్షకులుగా మారితే ఎలా ఉంటుందో చెప్పడానికి రెండు నెలలు క్రితం జరిగిన ఘటనే సజీవ సాక్ష్యం. కళ్లముందే రూ.70 లక్షల విలువైన ప్రభుత్వ ఆస్తి అపహరణకు గురైనట్లు ప్రజలలో బలంగా వినిపిస్తున్న ఆరోపణలుపై ఏమి పట్టనట్టు వ్యవహరిస్తున్న అధికారుల తీరు స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహజ్వాలలు వ్యక్తం చేస్తున్నారు. తిరుపతి జిల్లాలో ప్రభుత్వ పరిపాలన ఎంత దారుణంగా, నిర్లక్ష్యంగా ఉందో చెప్పడానికి సగుటూరు చెరువు ఘటనే ప్రత్యక్ష నిదర్శనం.
చెరువు కట్ట నుండి లోపలి దాకా దోపిడీ అనంతం!
సగుటూరు పంచాయతీ పరిధిలోని చెరువు కట్టపై ఏళ్ల తరబడిగా పెరిగిన, సుమారు రూ. 40 లక్షల విలువచేసే భారీ చెట్లను నిబంధనలకు విరుద్ధంగా 3 రోజుల వ్యవధిలోనే నరికివేసి తరలించారు. అంతటితో ఆగకుండా, చెరువు లోపల ఉన్న మరో రూ. 30 లక్షల విలువైన నల్ల తుమ్మ చెట్లను కూడా మాయం చేశారు. మొత్తం రూ.70 లక్షల విలువైన చెట్లు మాయమైపోతుంటే గ్రామస్తులు అడ్డుకున్నారా? అధికారులు పడుకున్నారా? అన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.
'నీదా-నాదా' ఆటలు. నెలలు గడుస్తున్నా లభించని సమాధానం!
ఈ భారీ దోపిడీ వెలుగు చూసి రెండు నెలలు కావస్తున్నా, పంచాయతీ రాజ్ మరియు ఇరిగేషన్ శాఖ అధికారుల తీరు మరీ దారుణంగా తయారైంది. ఇరిగేషన్ అధికారులు "అది పంచాయతీ పరిధిలోని అంశం" అని చెప్పి చేతులు దులుపుకుంటున్నారు. పంచాయతీ అధికారులు "చెరువు మా పరిధిలోకి రాదు, అది నీటిపారుదల శాఖ పని" అని సాకులు చెబుతున్నారు. గడిచిన రెండు నెలలుగా ఈ రెండు శాఖల అధికారులు ఒకరిపై ఒకరు నెపం నెట్టుకుంటూ కాలయాపన చేస్తున్నారే తప్ప, రూ.70 లక్షల ఆస్తిని దోచుకెళ్లిన చెట్ల మాఫియాపై ఒక్క ఎఫ్.ఐ.ఆర్ కూడా నమోదు చేయించలేకపోయారు.
క్రింది స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు వాటాల పంపిణీ?
ఈ వ్యవహారంలో అధికారుల నిర్లక్ష్యం చూస్తుంటే సామాన్యుడికి సైతం అనుమానాలు కలగక మానవు. రూ.70 లక్షల విలువ చేసే ప్రభుత్వ ధనాన్ని కాజేయడంలో క్రింది స్థాయి పంచాయతీ, ఇరిగేషన్ సిబ్బంది నుండి మొదలుకొని జిల్లా స్థాయి అధికారుల వరకు పెద్ద ఎత్తున 'మామూళ్లు మూటలు' వాటాలు రూపంలో ముట్టినందుకే ఈ నిశ్శబ్దం అని మండల ప్రజలు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. లక్షల విలువైన ఆస్తి కరిగిపోతుంటే చర్యలు తీసుకోకపోవడం వెనుక పెద్ద తిమింగలాల హస్తం ఉందనేది స్పష్టమవుతోంది.
జిల్లా యంత్రాంగం గాడి తప్పిందా?
తిరుపతి జిల్లాలో పరిపాలనా యంత్రాంగం పూర్తిగా గాడి తప్పిందనడానికి ఈ సంఘటనే అద్దం పడుతోంది. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో పర్యవేక్షించాల్సిన జిల్లా అధికారులు ఏమీ తెలియనట్లు నటిస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు. "ప్రజాధనాన్ని కరిగించిన అధికారులపై, చెట్లను అక్రమంగా నరికిన మాఫియాపై తక్షణమే చర్యలు తీసుకోకపోతే ప్రజలే తగిన విధంగా బుద్ధి చెప్తారని, ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు నిద్రమత్తు వీడి సగుటూరు చెరువు దోపిడీపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులైన అధికారులను సస్పెండ్ చేయాలని ప్రజలే గళం విప్పుతున్నారు."

Be the first to share your thoughts on this story!