Tuesday, 27 October 2026 News that matters, as it happens
Header-2
BREAKING

నాయుడుపేట ఎంపీడీవో కార్యాలయంలో పడకేసిన 'సమాచార హక్కు'! 30 రోజులు దాటినా అందని జవాబు. 50 రోజులైనా స్పందనేది? మొదటి అప్పీలు దాఖలు చేసిన దరఖాస్తుదారుడు. ఉచితంగా పూర్తి సమాచారం ఇవ్వాల్సిందేనని డిమాండ్!

ప్రచురణకర్త / Publisher: KADAPA
📍 నాయుడుపేట
📅 ప్రచురణ: 05 Oct 2026, 02:52 PM
🔄 నవీకరణ: 19 Oct 2026, 07:47 AM
👁️ 29 views
Share this Article:
నాయుడుపేట, అక్టోబర్ 5, మహి న్యూస్:
ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాల్సిన ప్రభుత్వ కార్యాలయాలు బాధ్యతారాహిత్యానికి వేదికగా మారుతున్నాయి. నాయుడుపేట మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయంలో సమాచార హక్కు చట్టం అమలు తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతోందనేదనడానికి తాజాగా వెలుగుచూసిన ఒక సంఘటనే ప్రత్యక్ష నిదర్శనం. ప్రజలు అడిగే సమాచారాన్ని నిర్ణీత సమయంలో ఇవ్వకుండా అధికారుల చుట్టూ తిప్పుకోవడం ఇక్కడ ఆనవాయితీగా మారిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గత ఆగస్టు 10వ తేదీన ఓక పౌరుడు నాయుడుపేట ఎంపీడీవో కార్యాలయంలో సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు దాఖలు చేశారు. చట్టం ప్రకారం దరఖాస్తు స్వీకరించిన పౌర సమాచార అధికారి దరఖాస్తును సెక్షన్ 6(3) కింద మండల ఉప ఎంపీడీవోకి బదిలీ చేస్తున్నట్లు దరఖాస్తుదారునికి కాపీ పంపించారు.

30 రోజుల గడువు శూన్యం. 50 రోజులైనా నోరుమెదపని అధికారులు!

సమాచార హక్కు చట్ట ప్రకారం దరఖాస్తు అందజేసిన 30 రోజుల్లోగా కోరిన సమాచారాన్ని దరఖాస్తుదారునికి అందించాలి. కానీ 50 రోజులు పూర్తయినా ఎంపీడీవో కార్యాలయం నుంచి కనీస స్పందన గానీ, సమాధానం గానీ రాకపోవడం గమనార్హం. దరఖాస్తును ఒకరి నుంచి మరొకరికి బదిలీ చేయడం జరిగిన తరువాత పౌర సమాచార అధికారిగా ఉన్న డిప్యుటీ ఎంపిడివో సమాచారం అందించడంలో తీవ్ర అలసత్వం వహించారు.

మొదటి అప్పీల్ దాఖలు.'ఉచితంగానే సమాచారం ఇవ్వాలి'

అధికారుల నిర్లక్ష్య వైఖరిపై విసిగిపోయిన దరఖాస్తుదారుడు సోమవారం మొదటి అప్పీలేట్ అథారిటీ అయిన నాయుడుపేట ఎంపీడీవోకు మొదటి అప్పీలు దాఖలు చేశారు. చట్టబద్ధమైన గడువు 30 రోజులు ముగిసినందున, ఆర్టీఐ చట్టం సెక్షన్ 7(6) ప్రకారం అడిగిన మొత్తం సమాచారాన్ని ఏ విధమైన రుసుము లేకుండా పూర్తి ఉచితంగా అందించాలని తన అప్పీలులో గట్టిగా డిమాండ్ చేశారు. సమాచార హక్కు చట్టం పట్ల అధికారులు చూపుతున్న ఈ ఘోర నిర్లక్ష్యంపై ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. చట్టాలను కట్టుదిట్టంగా అమలు చేయాల్సిన అధికారులే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సామాన్యుడికి న్యాయం ఎక్కడ దొరుకుతుందని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని, బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవడంతో పాటు, అడిగిన సమాచారాన్ని వెంటనే ఉచితంగా అందించాలని డిమాండ్ చేస్తున్నారు.
📰
Official Article Source Link
https://mahinewsindia.com/post/140

0 Comments

+ Leave a Comment

Be the first to share your thoughts on this story!

Leave a Comment
💬 Join Our Official WhatsApp Channel!
Get instant breaking news alerts, exclusive video updates, and top headlines delivered straight to your phone. Follow us on your favorite platforms!
💬 Follow WhatsApp Channel 📺 Subscribe YouTube 📷 Instagram ✈️ Telegram 🪺 Follow X