Tuesday, 27 October 2026 News that matters, as it happens
Header-2
BREAKING

దోబూచులాటా? దొంగాటా? సూళ్లూరుపేటలో విధులు. నెల్లూరులో ఉద్యోగం! అనుమతులు లేకుండానే ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి పని చేస్తున్నారా? అధికారిక రికార్డులపై తీవ్ర ఆరోపణలు.

ప్రచురణకర్త / Publisher: KADAPA
📍 తిరుపతి
📅 ప్రచురణ: 07 Oct 2026, 06:13 PM
🔄 నవీకరణ: 16 Oct 2026, 03:56 PM
👁️ 42 views
Share this Article:

తిరుపతి–నెల్లూరు, అక్టోబర్ 7, మహి న్యూస్:

తిరుపతి జిల్లా సూళ్లూరుపేట హౌసింగ్ కార్పొరేషన్ కార్యాలయంలో విధులు నిర్వహించాల్సిన ఆప్కాస్ ఔట్‌సోర్సింగ్ కంప్యూటర్ ఆపరేటర్ కోవూరు షీబా గత మూడు నెలలుగా నెల్లూరు పట్టణంలోని హౌసింగ్ కార్పొరేషన్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నారనే విషయం తాజాగా వివాదాస్పదంగా మారింది. అయితే, ఆమె విధుల మార్పుకు సంబంధించి మ్యూచువల్ బదిలీ, సంబంధిత జిల్లా కలెక్టర్ల అధికారిక అనుమతులు లేదా ఉన్నతాధికారుల అనుమతులు ఉన్నాయా? అనే ప్రశ్నలు ఇప్పుడు తీవ్రంగా తలెత్తుతున్నాయి.

తిరుపతి జిల్లా హౌసింగ్ కార్యాలయ రికార్డుల ప్రకారం, సూళ్లూరుపేటలో విధులకు హాజరు కావాల్సిన ఉద్యోగి అక్కడ విధులకు హాజరు కాకపోవడంతో అధికారులు పలుమార్లు మెమోలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఆ మెమోల ప్రతులను నెల్లూరు జిల్లా ఇన్‌చార్జ్ హౌసింగ్ హెడ్‌గా ఉన్న జహీరుద్దీన్‌కు కూడా పంపినట్లు రికార్డులే వెల్లడిస్తున్నాయి.

ఇదిలా ఉండగా, ప్రజా సమస్యల పరిష్కార వేదికలో దాఖలైన ఫిర్యాదుకు సంబంధించి నెల్లూరు హౌసింగ్ కార్యాలయం సమర్పించిన నివేదికలో తిరుపతి జిల్లా హౌసింగ్ అధికారుల అనుమతితోనే కోవూరు షీబా అనే అప్కాస్ ఉద్యోగి నెల్లూరులో విధులు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్న అంశం ఇప్పుడు ప్రధాన చర్చగా మారింది.

ఒకవైపు తిరుపతి జిల్లా హౌసింగ్ కార్యాలయం నుంచి ఉద్యోగికి మెమోలు జారీ అవుతుండగా, మరోవైపు అదే ఉద్యోగి నెల్లూరులో విధులు నిర్వహించడానికి అనుమతి ఉందని నివేదిక సమర్పించబడితే ఈ రెండు విభిన్న పరిస్థితుల్లో అసలు నిజం ఏది? అన్నది తేలాల్సి ఉంది. అనుమతి ఉంటే ఆ అనుమతి పత్రం ఎక్కడ? ఏ అధికారి జారీ చేశారు? ఏ తేదీన జారీ చేశారు? ఏ నిబంధన ప్రకారం విధులు మార్చారు? జీతం ఎవరి హాజరు ఆధారంగా చెల్లించారు? అనే ప్రశ్నలకు హౌసింగ్ శాఖ స్పష్టమైన సమాధానం ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ప్రభుత్వ ఉద్యోగి విధుల విషయంలో నిబంధనలు ఒకరికి ఒకలా, మరొకరికి మరోలా ఉంటే అది కేవలం ఒక ఉద్యోగి వ్యవహారం కాదు. ప్రభుత్వ పరిపాలనా వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనం, అధికారిక ఆదేశాల విలువపై ప్రశ్నలు తలెత్తే అంశం. ముఖ్యంగా ప్రజా సమస్యల పరిష్కార వేదికకు సమర్పించే నివేదికలు వాస్తవ ఆధారాలపై ఉండాల్సిన నేపథ్యంలో, రికార్డులకు విరుద్ధంగా లేదా వాస్తవాలను దాచిపెట్టి నివేదిక సమర్పించారా? అనే ఆరోపణలు నిజమైతే అది అత్యంత తీవ్రమైన పరిపాలనా అంశంగా మారే అవకాశం ఉంది. ప్రతి సోమవారం ప్రభుత్వ కార్యాలయాలకు అర్జీలు పట్టుకుని వెళ్లే సామాన్య ప్రజలు తమ సమస్యలకు న్యాయం జరుగుతుందని నమ్ముతున్నారు. అలాంటి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థకు సమర్పించే నివేదికల్లో వాస్తవాలపై స్పష్టత లేకపోతే, ప్రజల విశ్వాసానికి భంగం కలిగే ప్రమాదం ఉంది.

అందువల్ల ఈ వ్యవహారంపై కోవూరు షీబా విధుల మార్పుకు సంబంధించిన అనుమతి పత్రాలు, హాజరు రికార్డులు, జీతాల చెల్లింపు వివరాలు, మెమోలు, అధికారుల మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలు, ప్రజా సమస్యల పరిష్కార వేదికకు సమర్పించిన నివేదికలను ఉన్నతాధికారులు సమగ్రంగా పరిశీలించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ వ్యవహారంలో అసలు దోబూచులాట ఎక్కడ జరిగింది? తప్పు ఎవరిది? అధికారిక రికార్డులు ఏం చెబుతున్నాయి? ప్రజా సమస్యల పరిష్కార వేదికకు సమర్పించిన నివేదికలో వాస్తవాలేంటి? అన్నది ఉన్నతస్థాయి విచారణతో తేలాల్సి ఉంది.

📰
Official Article Source Link
https://mahinewsindia.com/post/142

0 Comments

+ Leave a Comment

Be the first to share your thoughts on this story!

Leave a Comment
💬 Join Our Official WhatsApp Channel!
Get instant breaking news alerts, exclusive video updates, and top headlines delivered straight to your phone. Follow us on your favorite platforms!
💬 Follow WhatsApp Channel 📺 Subscribe YouTube 📷 Instagram ✈️ Telegram 🪺 Follow X