Wednesday, 28 October 2026 News that matters, as it happens
Header-2
BREAKING

స్థానిక ఎన్నికలపై అవగాహన: ఎస్సై శివశంకర్.

ప్రచురణకర్త / Publisher: KADAPA
📍 నాయుడుపేట
📅 ప్రచురణ: 08 Oct 2026, 07:08 PM
🔄 నవీకరణ: 18 Oct 2026, 11:23 PM
👁️ 73 views
Share this Article:
నాయుడుపేట, అక్టోబర్ 8, మహి న్యూస్: రాబోయే పురపాలక స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా బి.డి. కాలనీ, 25వ వార్డు పరిధిలోని గురువారం ప్రజలకు స్థానిక పోలీసుల ఆధ్వర్యంలో సమగ్ర అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయుడుపేట పట్టణ ఎస్సై శివశంకర్ మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై తమ విలువైన ఓటు హక్కును శాంతియుత వాతావరణంలో, బాధ్యతాయుతంగా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు ముగిసేలా ప్రజలు పోలీసు వ్యవస్థకు సహకరించాలని కోరారు. అనంతరం సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అపరిచిత వ్యక్తులతో బ్యాంక్ వివరాలు, ఓటీపీలు పంచుకోవద్దని సూచించారు. గంజాయి, ఇతర మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలు, సమాజంపై దాని ప్రభావాన్ని వివరించారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని, మహిళలపై జరుగుతున్న అన్యాయాలు, వారి రక్షణకు అందుబాటులో ఉన్న చట్టాలు మరియు అత్యవసర సమయాల్లో డయల్ 112 సేవలను ఎలా ఉపయోగించుకోవాలో స్పష్టంగా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో నాయుడుపేట పోలీసులు, వార్డు ప్రజలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
📰
Official Article Source Link
https://mahinewsindia.com/post/143

0 Comments

+ Leave a Comment

Be the first to share your thoughts on this story!

Leave a Comment
💬 Join Our Official WhatsApp Channel!
Get instant breaking news alerts, exclusive video updates, and top headlines delivered straight to your phone. Follow us on your favorite platforms!
💬 Follow WhatsApp Channel 📺 Subscribe YouTube 📷 Instagram ✈️ Telegram 🪺 Follow X